Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

బ‌ర్నింగ్‌స్టార్ పొలిటిక‌ల్ ఎంట్రీ..! ఏ పార్టీ నుంచో తెలుసా..!-Burning Star Sampoornesh Babu Political Entry

టాలీవుడ్‌లో హృద‌య కాలేయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంపూర్ణేష్ బాబు ఒకే ఒక్క సినిమాతో బ‌ర్నింగ్‌స్టార్ అయిపోయాడు. ఆ సినిమా త‌ర్వాత సంపూకు తెలుగులో వ‌చ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఇక హృద‌య‌కాలేయం త‌ర్వాత సంపూను వ‌రుస‌గా అవ‌కాశాలు వెతుక్కుంటూ వ‌చ్చాయి. పెస‌ర‌ట్టు, సింగం 123 సినిమాలు చేసిన సంపూ తాజాగా వైర‌స్ సినిమాతో హీరోగా మ‌రోసారి మ‌న ముందుకు వ‌చ్చాడు.

ఇక లేటెస్ట్‌గా సంపూర్ణేష్‌బాబు బిగ్ బాస్ హౌస్‌లో ర‌చ్చ ర‌చ్చ చేసి ఇప్పుడు అవుట్ అయ్యాడు. తెలంగాణ‌లోని సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట‌కు చెందిన సంపూర్ణేష్ అడుగులు ఇప్పుడు పొలిటిక‌ల్ ఎంట్రీ వైపు ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. బర్నింగ్‌స్టార్ వ‌చ్చే ఎన్నిక‌ల వేళ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోన్న‌ట్టు తెలుస్తోంది.

సంపూకు స‌మ‌కాలీన అంశాల‌పై మంచి అవ‌గాహ‌న ఉంది. సంపూది తెలంగాణ అయినా ఆయ‌న‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లోను అభిమానులు ఉన్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం విశాఖ‌లో జ‌రిగిన స‌భ‌కు సంపూ డేర్ చేసి వెళ్లిన తీరుతో ఆయ‌న అంద‌రి మ‌న‌స్సులు గెలుచుకున్నారు. ఇక సంపూ 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌లోకి ఎంట్రీ ఇచ్చి ఆ పార్టీ త‌ర‌పున తెలంగాణ నుంచి అసెంబ్లీ బ‌రిలో ఉంటాడ‌ని వార్త‌లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Continue Reading

Trending…

To Top