బన్ని ఫేవరేట్ హీరోలు వీరేనట..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి తన అభిమాన నటుడని బాహాటంగా చెప్పిన సందర్భాలు మనకు తెలుసు.అయితే మెగా ఫ్యామిలీ, మెగా స్టార్ కాకుండా నచ్చిన హీరోలు ఎవరు అని బన్ని ముందు ప్రశ్న ఉంచితే షారుఖ్ అని అంటుండే వాడు.

 Bunny Opens About His Favorite Hero’s-TeluguStop.com

అయితే ఇప్పుడు తన డెశిషన్ మార్చుకున్నట్టు తెలుస్తుంది.అవును షారుఖ్ ను అమితంగా అభిమానించే బన్ని తనని థర్డ్ ప్లేస్ లోకి నెట్టి తన ఫేవరేట్ స్థానంలో సల్మాన్ ఖాన్ ను పెట్టేశాడు.

ఈ మధ్య కాలంలో షారుఖ్ చాలా వెనుక పడ్డ సంగతి తెలిసిందే.ఓ పక్క అమీర్ తన విలక్షణ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నా వరుస కమర్షియల్ సక్సెస్ లతో సల్మాన్ క్రేజ్ సంపాదించాడు.

ఇక సల్మాన్ తర్వాత కోలీవుడ్ హీరో విజయ్ తనకు నచ్చిన హీరో అనేశాడు బన్ని.విజయ్ సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ బాగా ఆకట్టుకుంటాయన్న బన్ని తను నటించిన తుపాకి, కత్తి సినిమాలు తన ఫేవరేట్ అనేశాడు.

అయితే విజయ్ సినిమాల మాదిరి తన సినిమాల్లో కూడా మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండేలా జాగ్రత్త పడతానని అన్నారు.ఇక బాలీవుడ్లో ఏ హీరోయిన్స్ తో జతకట్టాలని ఉందనగా అలియా భట్, పరిణీతి చోప్రాల పేర్లు చెప్పేశాడు బన్ని.

మరి హరీష్ శంకర్ డైరక్షన్లో చేయబోతున్న సినిమాలో వీరిద్దరిలో ఒకరిని హీరోయిన్ గా ఓకే చేస్తారేమో చూడాలి.తానో స్టార్ హీరో అయినా నచ్చిన హీరోల పట్ల బన్ని చెప్పిన విషయాలు ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube