పవన్ కి బన్ని, మహేష్ కి ఎన్టీఆర్

ఏప్రిల్ 8, అల్లు అర్జున్ పుట్టినరోజు.అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటే, పవన్ అభిమానులు మాత్రం దిగాలుగా కూర్చున్నారు.

 Bunny And Ntr Birthdays Went Wrong For Pawan And Mahesh-TeluguStop.com

అప్పటికి ఇరువురి ఫ్యాన్స్ మధ్య గొడవలేం లేవులేండి.సరిగ్గా అదేరోజు సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలైంది కదా.అందుకే పవన్ ఫ్యాన్స్ సర్వస్వం కోల్పోయినవారిలా ఓ మూలన కూర్చిండిపోయారు.

మే 20, అంటే నిన్న.

ఎన్టీఆర్ పుట్టినరోజు.యంగ్ టైగర్ ఫ్యాన్స్ అన్నదానాలు, రక్తదానాలు, కేక్ కటింగ్ అంటూ ఎన్టీఆర్ పుట్టినరోజుని అస్వాదిస్తూ ఉంటే, మహేష్ అభిమానులు మాత్రం ఎక్కడ సందు దొరికితే అక్కడ దాక్కోవడానికి ప్రయత్నించారు.

ఎందుకంటే నిన్నేగా బ్రహ్మోత్సవం విడుదలై డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది.

ఇద్దరు స్టార్ల పుట్టినరోజు నాడే, మరో ఇద్దరు స్టార్లు, తమ కేరిర్లో అతిపెద్ద ఫ్లాపుల రుచి చూడటం నిజంగా విడ్డూరం, యాదృచ్ఛికం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube