Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

బికామ్ లో ఫిజిక్స్ లాగా పవన్ కళ్యాణ్ కొత్త చదువు ... పరువు పోయింది-Bulb Was Invented By Albert Einstein – Pawan Kalyan

బీకామ్ చదివే ఏ స్టూడెంట్ ని అడిగినా సరే, నిద్రలోంచి అప్పుడే లేచి బీకామ్ లో కామర్స్, అకౌంట్స్, మార్కెటింగ్ ఉంటాయని టకాటకా చెప్పేస్తాడు. అలాంటి ఫేమస్ గ్రూప్ బీకామ్ లో సైన్స్ కి సంబంధించిన ఫిజిక్స్ అనే కొత్త సబ్జెక్టుని ప్రవేశపెట్టారు తెదేపా నేత జలీల్ ఖాన్. దాంతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఓ కొత్తరకం సైన్స్ సబ్జెక్టుని కనిపెట్టారు. ఆ సబ్జెక్టులో బల్బుని ప్రపంచానికి పరిచయం చేసింది థామస్ అల్వా ఎడిసన్ కాదు, అల్బర్ట్ ఐన్ స్టీన్.

ఇటివలే ఒక జనసేన కార్యకర్తల మీట్ లో మాట్లాడిన పవన్, వారిలో స్ఫూర్తిని నింపేందుకు థామస్ బల్బుని కనిపెట్టిన తరువాత చేసిన ఫేమస్ వ్యాఖ్య “నేను 1000 సార్లు విఫలం అవలేదు. ఇంతసేపు బల్బుని ఎలా తయారుచేయకూడదో నేర్చుకున్నాను” ని తన ప్రసంగంలో ఇరికిస్తూ, “ఐన్ స్టీన్ చెబుతాడు, ఒక బల్బు ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడు “how not to invent, దీన్ని ఎలా నిర్మించలేము అని తెలుసుకోవడమే” .. అంటూ తాను ఓడిపోయినప్పుడల్లా ఇలానే అనుకుంటానని చెప్పారు.

ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నవ్వులపాలవుతున్నాయి. ఎందుకంటే బల్బుని కనిపెట్టింది, ఆ ఫేమస్ కోట్ చెప్పింది ఎడిసన్, ఐన్ స్టీన్ కాదు. ప్రైమరీ స్కూల్ పాఠాల్లో కూడా ఈ సింపుల్ విషయం ఉంటుంది. పొరపాటులో ఎడిసన్ కి బదులు ఐన్ స్టిన్ అన్నరా లేక బల్బుని కనిపెట్టింది ఎడిసన్ అని తెలియక అన్నారా? కారణం ఏదైనా, జలీల్ ఖాన్ “బీకామ్ లో ఫిజిక్స్” మాదిరి ఇది కూడా వైరల్ గా వెళ్ళేలా ఉంది. పవర్ స్టార్ అభిమానులు కొత్తగా పుట్టుకొచ్చే జోకులని భరించక తప్పదు.

More Posts
To Top
Raashi Khanna New Pics