బుచ్చి బాబు లో గురువు పోలిక.. ఎన్టీఆర్ తో హిట్ ఖాయం

ఒకప్పుడు సక్సెస్‌ వచ్చిన దర్శకులు బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలను చేసేవారు.కాని ఇప్పుడు ఎంత పెద్ద సక్సెస్ వస్తే తదుపరి సినిమాకు అంత ఆలస్యం అవుతుంది.

 Buchi Babu Also Like His Guru Taking Much Time For Next Film Details, Director B-TeluguStop.com

రంగస్థలం సినిమా తో ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్న దర్శకుడు సుకుమార్ దాదాపు నాలుగు ఏళ్ల గ్యాప్ తర్వాత పుష్ప సినిమాను విడుదల చేశాడు.ఇక భరత్‌ అనే నేను సినిమా ను నాలుగు సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన దర్శకుడు కొరటాల శివ ఇప్పటి వరకు తదుపరి సినిమా ఆచార్యను విడుదల చేయలేక పోయాడు.

ఇక అల వైకుంఠపురంలో సినిమా తో రెండేళ్ల క్రితం ఘన విజయాన్ని సొంతం చేసుకున్న త్రివిక్రమ్‌ ఇప్పుడు తదుపరి సినిమా ను మహేష్ బాబుతో చేసేందుకు పడిగాపులు కాస్తున్నాడు.ఇలా ఎంతో మంది స్టార్‌ డైరెక్టర్స్ సక్సెస్ తర్వాత వెంటనే సినిమా ను చేసేందుకు అవకాశం లేకుండా పోయింది.

ఇప్పుడు అలాగే ఉప్పెన సినిమా తో బ్లాక్‌ బస్టర్ సక్సెస్‌ దక్కించుకున్న దర్శకుడు బుచ్చి బాబు తదుపరి సినిమా కోసం కనీసం రెండేళ్ల వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు అంటున్నారు.

ఇప్పటికే ఉప్పెన విడుదల అయ్యి ఏడాది అవుతుంది.

మరో ఏడాది వరకు ఆయన సినిమా పట్టాలు ఎక్కే అవకాశం కనిపించడం లేదు.సినిమా పట్టాలెక్కిన తర్వాత సినిమా విడుదలకు మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది.

అంటే ఉప్పెన తర్వాత బుచ్చి బాబు సినిమా రావడానికి మూడు సంవత్సరాలు సమయం పడుతుంది.

ఒక హిట్‌ మూవీ తర్వాత ఇంత గ్యాప్ తీసుకుంటే కెరీర్‌ మొత్తంలో వీళ్లు తీసే సినిమాలు ఎన్ని ఉంటాయి.మరీ ఇంత ఆలస్యం భావ్యం కాదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఉప్పెన సినిమా తర్వాత బుచ్చి బాబుకు ఎన్టీఆర్‌ అవకాశం ఇచ్చాడు.

అయితే ఎన్టీఆర్‌ ప్రస్తుత కమిట్‌మెంట్స్ పూర్తి అవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.కనుక అప్పటి వరకు బుచ్చి బాబు వెయిట్ చేయాల్సిందే.

ఆ లోపు చిన్న సినిమా ను తీసేందుకు కూడా బుచ్చి బాబు సిద్దంగా లేడని టాక్ వినిపిస్తుంది.గురువు మాదిరిగానే పట్టుదలతో స్టార్‌ హీరోతో సినిమా కోసం ఏళ్లకు ఏళ్లు వృదా చేసుకుంటున్నాడు.

Buchi Babu Also Like His Guru Taking Much Time For Next Film Details, Director Buchi Babu, Koratals Siva, Jt Ntr, Director Sukumar, Acharya, Pushpa, Buchi Babu And Ntr Movie, Tollywood - Telugu Acharya, Buchi Babu Ntr, Buchibabu, Buchi Babu, Sukumar, Jt Ntr, Koratals Siva, Pushpa, Tollywood, Uppena

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube