ఈ ఆఫర్ ముందు జియో ఆఫర్ ఎందుకు పనికిరాదు రోజుకి 4 జీబి

ప్రపంచంలో అత్యధిక మొబైల్ డేటా వాడుతున్న దేశం ఏదో తెలుసా ? ఈరోజుల్లో మనవాళ్ళుని దాటేవారు ఎవరున్నారు .మనమే.జియో రాకముందు టాప్ 50 లో కూడా లేని భారత్, జియో రాకతో ఎకంగా నెం.1 స్థానంలో కూర్చుంది.ఇప్పుడు మొబైల్ డేటా వినియోగంలో, మన దరిదాపుల్లో కూడా ఏ దేశం లేదు.అంతటి విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి, వంద మిలియన్ల కస్టమర్లని దాటిన జియో, ఇప్పుడు కొంచెం నెమ్మదించింది.

 Bsnl Announces 4gb/day Offer At Cheap Price-TeluguStop.com

జియో కొత్త కస్టమర్లు ఊహించిన వేగంతో పుట్టుకురావడం లేదు.కారణం, జియో కన్నా మెరుగైన ఆఫర్లతో ఇతర కంపెనీలు వస్తుండటమే

ప్రభుత్వ కంపెని బిఎస్ఎన్ఎల్ మిగితా మొబైల్ ఆపరేటర్స్ అందరికి ముచ్చెమటలు పట్టించే ఆఫర్ ని ప్రకటించింది.

ఈ ఆఫర్ గనుక ప్రజల్లోకి వెళ్ళి ప్రాచూర్యం పొందితే, జియో మరింతగా నెమ్మదించడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు టెక్ నిపుణులు.మరి అంతలా టెలి ట్రేడ్ ని ఆకర్షిస్తున్న ఆ ఆఫర్ ఏంటో చూడండి

పోస్ట్ పెయిడ్ కాదు, ప్రిపెయిడ్ వినియోగదారుల కోసమే బంపర్ ఆఫర్ ప్రకటించింది బిఎస్ఎన్ఎల్.

కేవలం 444 రూపాయలతో రిఛార్జీ చేసుకుంటే, మూడు నెలల వరకు హై స్పీడ్ 3G ఇంటర్నెట్ మీ సొంతం.రోజుకి ఎంత జీబి వస్తుందో తెలుసా? జియో, ఎయిర్ టెల్, ఐడియా అందిస్తున్నట్లుగా ఒక జీబి కాదు, ఏకంగా 4జీబి రోజూ వాడుకోవచ్చు.ఒక్క జీబికి మీరు ఖర్చుపెట్టేది మిగితా ఏ కంపేనితో పోల్చుకున్నా, సగం కన్నా తక్కువ.మీదగ్గర 4G కాకుండా 3G ఫోన్ ఉన్నా ఈ ఆఫర్ ని వాడుకోవచ్చు.

ఇక 4G ఫోన్ ఉంటే 3G ఎలాగో వాడుకోవచ్చు

ఒకవేళ మీరు రోజుకి 4 జీబి ఏం చేసుకోవాలి అనుకున్నా, లేదంటే మీకు 3G వద్దు 4G మాత్రమే కావాలి అనుకున్నా, మీకోసం ₹333 ఆఫర్ సిద్ధంగా ఉంది.ఇందులో రోజుకి 3జిబి 4G డేటా వస్తుంది.

వ్యాలిడిటి 90 రోజులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube