స్టార్ హీరోల సినిమాతో వచ్చే చిక్కే ఇది .సినిమాకి మంచి టాక్ వస్తే డబ్బులంటే డబ్బులే .
అది చూసే గుడ్డి నమ్మకంతో మరో సినిమా మీద అప్పులు చేసి డబ్బులు పెట్టేస్తారు బయ్యర్లు .భారి రెట్లు ఉంటాయి కాబట్టి , స్టార్ హీరో సినిమా బోల్తాపడింది అంటే ఇక నరకమే .లెక్క ఎటు చూసిన కోట్లల్లోనే .బ్రహ్మోత్సవం ఫ్లాపు అవడం వలన చాలా జీవితాలే నష్టపోతున్నాయి .
ఇప్పటికే పంపిణిదారులకి నష్టపరిహారం చెల్లిస్తామని మాటిచ్చారు నిర్మాతలు .మహేష్ బాబు కూడా డిస్ట్రీబ్యుటర్స్ ని ఆదుకుంటానని చెప్పారట .వాళ్ళ సంగతి సరే , మరి మా పరిస్థితి ఏంటి అని గగ్గోలు పెడుతున్నారు ఎగ్జిబీటర్లు.
రూపాయికి 80 పైసలు నష్టపోతున్నామని , తెలంగాణ పంపిణిదారులైనా అభిషేక్ పిక్షర్స్ , శ్రీకాంత్ అడ్డాల , నిర్మాత పివిపి ని సంప్రదించి తమకు న్యాయం జరిగేలా చూడామని ఫిలిం చాంబర్ కు లేఖ రాసారు తెలంగాణ ఎగ్జిబీటర్లు .ఈ విషయంపై ఎవరెలా స్పందిస్తారో చూడాలి .
.