బ్రహ్మోత్సవం నష్టాల డీల్ కుదిరింది

మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం ఇప్పటికే భారి డిజాస్టర్ అనే ముద్ర వేయించుకుంది.ఏమాత్రం పసలేని కలెక్షన్లు చూసి దిగులుపడిన పంపిణీదారులకి నిర్మాత పివిపి నుండి పిలుపు అందింది.

 Brahmotsavam Losses – Deal Happened Between Buyers And Producer-TeluguStop.com

దాంతో డిస్ట్రిబ్యూటర్లంతా వెళ్ళి నిన్న నిర్మాతను కలిసారు.

తాము మళ్ళీ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నామని, దానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారని, వచ్చే ఎడాది విడుదలకు ప్లాన్ చేసి, ఆ సినిమాతో నష్టపరిహారం అందిస్తామని పివిపి ఒక ప్రపోజల్ బయ్యర్ల ముందు ఉంచితే, దాన్ని పూర్తిగా నిరాకరించారట పంపిణీదారులు.

దీనికి కారణం, పివిపి చెప్పిన ప్రపోజల్ నమ్మశక్యంగా లేకపోవడమే.ఎందుకంటే మహేష్ తదుపరి చిత్రం మురుగదాస్ తో ఫిక్స్ అయిపోయింది.

ఆ సినిమా పూర్తయ్యి విడుదల కావడానికే ఒక ఏడాది పడుతుంది.ఆ తరువాత పూరి జగన్నాథ్ సినిమా లైన్ లో ఉంది.

చాలాసేపు జరిగిన చర్చలు చివరకు ఓ నిర్ణయంతో ముగిసాయి.అదేటంటే, కనీసం 40% శాతం నష్టాలు ఏ డిస్ట్రిబ్యూటర్ కి అయితే వస్తాయో, వారికి మాత్రమే నష్టపరిహారం పివిపి చెల్లిస్తుందని టాక్.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారమైతే ఇదే బయ్యర్లు, నిర్మాత మధ్య కుదిరిన డీల్.మరి ఇక్కడితో ఈ గొడవ ఆగిపోతుందో లేక ఇంకేదైనా మలుపు తిరుగుతుందో ఇప్పుడే చెప్పలేం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube