బ్రహ్మోత్సవం ఇన్ సైడ్‌ రిపోర్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది.పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి.

 Brahmotsavam Inside Report-TeluguStop.com

ఇక పనులన్ని పూర్తి చేసుకోని విడుదల తేదిని ప్రకటించడమే తరువాయి.

ఈ సినిమాకి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ వర్గాల టాక్ మా చెవిన పడటం జరిగింది.

సినిమా బాగా వచ్చిందట.ఫస్ట్ హాఫ్ లో మహేష్ వేసే చురకలు బాగా పండాయంట.

యూత్ కి ఈ పంచ్లు నచ్చుతాయని సమాచారం.హీరోయిన్లతో మహేష్ కెమిస్ట్రీ కూడా అదిరిపోతుందని వార్త.

ఇక సెకండాఫ్ లో ఎక్కువగా ఎమొషనల్ మూమెంట్స్ ఉంటాయట.సమంతతో వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకమని, సత్యరాజ్, మహేష్ కి సంబంధించిన ఎపిసోడ్లు కంటతడి పెట్టిస్తాయని టాక్.

అన్నీ పాజిటివ్ విషయాలే కాదండోయ్, నెగేెటివ్ విషయాలు కూడా ఉన్నాయి.సినిమా స్లోగా నడుస్తుందట.

ఫ్యామిలి ఎమోషన్స్ కూడా మరీ ఎక్కువ పెట్టేశారని టాక్.దీనివల్ల మాస్ ప్రేక్షకులతో పాటు, మహేష్ నుంచి ఆశించే ఎలిమెంట్స్ కరువవడంతో అభిమానులు కూడా డిజపాయింట్ అయ్యే అవకాశం లేకపోలేదు.

ఒవరాల్ గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు కంటే బాగా వస్తున్న సినిమా అని సెలవిచ్చారు పంపిణీ వర్గాలు.అయితే దీన్ని పట్టుకోని ఇదే ఫైనల్ అని అనుకోలేం మనం.ఎందుకంటే పంపిణీదారులకి పక్కగా అన్నీ తెలిస్తే వారు హిట్ అయ్యే సినిమాలు మాత్రమే కొంటారు కదా!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube