తడాఖా చూపిస్తున్న మహేష్

శ్రీమంతుడితో పునర్వైభవాన్ని సంతరించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాక్సాఫీస్ దగ్గర తన పదునంతా చూపిస్తున్నాడు.అది అలాంటి ఇలాంటి పదును కాదు, అదో రకం.

 Brahmotsavam Business Begins-TeluguStop.com

బ్రహ్మోత్సవం చిత్రానికి సంబంధించి బిజినెస్ చర్చలు అప్పుడే మొదలయ్యాయి.సూపర్ స్టార్ మళ్లి తన రికార్డులను తానే బద్దలు కొడుతున్నాడు.

బాహుబలిని తప్పిస్తే అత్యధిక బిజినెస్ చేసిన చిత్రం శ్రీమంతుడు.అంతకు ముందు ఈ రికార్డు మరో మహేష్ బాబు చిత్రం 1 నేనొక్కడనే పేరున ఉండేది.

ఆ రికార్డును అవలీలగా కొట్టేసాడు మహేష్.ఇప్పుడు శ్రీమంతుడు రికార్డును కొట్టే అవకాశాలు కేవలం సర్దార్ గబ్బర్ సింగ్ కు మాత్రమే ఉన్నాయి.

ఒకవేళ సర్దార్ కొత్త రికార్డు క్రియేట్ చేసినా, ఆ రికార్డులను బ్రహ్మోత్సవం దాటడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ చిత్రం యొక్క నైజాం రైట్స్ కోసం చర్చలు మొదలయ్యాయి.

ప్రస్తుతానికి వినిపిస్తున్న రేట్ 19 కోట్లు.ఇది విని ముక్కున వేలేసుకునే లోపు ఇది కుడా చదవండి.

బ్రహ్మోత్సవం ఓవర్సీస్ రైట్స్ 13 కోట్లదాకా చెబుతున్నారు.ఓవర్సీస్ వరకు సర్దార్ కుడా ఈ రికార్డుకు దగ్గరలో రాలేదు.

మొత్తానికి మహేష్ తన తడాఖా చూపిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube