మహేష్ బాబు ... ఇదేమి చెత్త రికార్డు

ఓవర్సీస్ మార్కెట్ అనగానే మొదట గుర్తొచ్చే పేరు మహేష్ బాబు.ఇన్నిరోజులు రికార్డులకి, భారి వసూళ్ళకి, లాభాలకి మహేష్ గుర్తోచ్చేవాడు.

 Brahmotsavam – Biggest Disaster In Overseas-TeluguStop.com

కాని ఇకపై నష్టాలకు కూడా గుర్తొస్తాడు.ఎందుకంటే మహేష్ బాబు కెరీర్ లోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలో, అతిపెద్ద ఓవర్సీస్ డిజాస్టర్ గా నిలువనుంది బ్రహ్మోత్సవం.

అసలు మహేష్ బాబు సినిమా నడుస్తోందా అనేలా ఉండి అక్కడ పరిస్థితి.ఏ ఫ్లాపు సినిమాకి లేనిది, ఈ చిత్రానికి మాత్రం ఇలా ఉందేంటి అని తల బాదుకుంటున్నారు ఓవర్సీస్ బయ్యర్లు.

టాక్ తో సంబంధం లేకుండా ఓవర్సీస్ కలెక్షన్లు రాబట్టే మహేష్ బాబుకి ప్రేక్షకులు చుక్కలు చూపించారు ఈసారి.

ఎంత లేదన్నా, 7 కోట్లకు పైగా నష్టం వస్తోంది ఈ చిత్రానికి.

ఇది సర్దార్ కన్నా ఎక్కువే.ఓవర్సీస్ లో సర్దార్ కన్నా ఎక్కువ కలెక్షన్లు రాబట్టి, సర్దార్ కన్నా ఎక్కువ నష్టాలు తీసుకొస్తోంది బ్రహ్మోత్సవం.

దీనికి కారణం కేవలం మహేష్ బాబుని నమ్ముకొని బయ్యర్లు 13 కోట్లు పెట్టేయ్యడమే

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube