సక్సెస్ ఫుల్ డైరక్టర్ బోయపాటి శ్రీను మీద అనూహ్యంగా దర్శకుడు రచయిత నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన కామెంట్స్ చేశాడు.గురువు కాబట్టి పోసాని బోయపాటి మీద తన కోపాన్ని అలా బయట పెట్టాడనుకోండి.
అయితే అసలకే తన సినిమాల్లో హీరోలకు ఎంత పౌరుషం చూపిస్తాడో తనలో కూడా అంతే ఉంది అంటుంటారు.మరి అదే కసితో పోసాని తన మీద చేసిన కామెంట్స్ కు రివర్స్ ఎటాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట బోయపాటి శ్రీను.
త్వరలో ప్రొద్దుటూరులో జరుపుకోనున్న లెజెండ్ 1000 రోజుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే వేదికలో పోసాని చేసిన కామెంట్స్ కు తన వివరణ ఇస్తాడని అంటున్నారు బోయపాటి శ్రీను సన్నిహిత వర్గాలు.మరి వివరణ ఇస్తే ఓకే కాని పోసాని మీద మళ్లీ ఏదైనా కామెంట్ చేస్తే మాత్రం ఆయన ఊరుకుని ఉండే ప్రసక్తే లేదు.
ఉన్నది ఉన్నట్టు మొహం మీద కొట్టినట్టు మాట్లాడే పోసాని గురించి తెలిసి బోయపాటి శ్రీను కామెంట్స్ చేస్తాడా లేద క్లారిటీ ఇస్తాడా అన్నది చూడాలి.
.