జ‌న‌సేన‌లోకి తండ్రీకొడుకులు జంప్‌..?

మంత్రి ప‌ద‌వి ఆశించి భంగ‌ప‌డిన వారిలో విజ‌య‌వాడ‌కు చెందిన ఎమ్మెల్యే బోండా ఉమామమేశ్వ‌రావు కూడా ఉన్నారు.అప్ప‌ట్లో తీవ్రంగా నిరాశ‌చెందిన ఆయ‌న‌.

 Bonda Uma And His Son To Join Janasena-TeluguStop.com

సీఎంపైనే విమ‌ర్శ‌లు గుప్పించారు.సీఎం చంద్ర‌బాబు జోక్యంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది.

అయితే మ‌రోసారి ఆయ‌న వ్య‌వ‌హారం పార్టీ అధినేత దృష్టికి వెళ్లింది.ముఖ్యంగా ఆయ‌న త‌న‌యుడు ర‌వితేజ‌ తీరు కూడా కొంత చర్చ‌నీయాంశ‌మైంది.

స్వ‌త‌హాగా ర‌వితేజ‌ ప‌వ‌న్ అభిమాని కావ‌డం, బోండా కాపు వ‌ర్గానికి చెందిన కావ‌డంతో ఇక జ‌న‌సేన వైపు ఇద్ద‌రూ వెళ్లిపోతార‌నే ప్ర‌చారం జోరుగా వినిపిస్తోంది.దీంతో ఇప్పుడు బోండా వ్య‌వ‌హారం మ‌రోసారి పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది

వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందా? లేదా? అన్నది ఇంకా సందిగ్దంలోనే ఉంది.హోదాపై కేంద్రంలో ఉన్న బీజేపీని ఉతికి పారేస్తున్న పవన్.బీజేపీ, టీడీపీలతో పొత్తు పెట్టుకుంటారా? అన్న విష‌యంపై ఇంకా క్లారిటీ రాలేదు.సొంతంగానే పోటీచేస్తాన‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని వైపు ఇప్ప‌టికే వివిధ పార్టీల్లోని సీనియ‌ర్లంతా చూస్తున్నారు.ఈ నేప‌థ్యంలోనే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు కూడా జ‌న‌సేనలోకి వెళ్లిపోతార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది.

వాస్తవానికి గత ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం బోండాకు దక్కిందంటే అది పవన్ సిఫార్సు వల్లనేనని అందరికీ తెలిసిందే

ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో బోండా ఉమ మంత్రి పదవిని ఆశించారు.అది రాకపోవడంతో అధిష్టానం పై దిక్కార స్వరం వినిపించారు.

కాపుల గొంతు కోశారంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు.దీనిపై చంద్రబాబు ఉమకు క్లాస్ పీకినట్లు కూడా వార్తలొచ్చాయి.

అప్పటి నుంచి బోండా ఉమ కొంత మౌనంగానే ఉంటూ వస్తున్నారు.ఉమకు ఎంపీ కేశినేని నాని మద్దతు ఫుల్ గా ఉంది.

అయితే కేశినేని నానికే ఇప్పుడు పార్టీలో పరిస్థితి సక్రమంగా లేదు.ఆయన తన వ్యాఖ్యలతో పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టడంతో కొంత దూరంగా పెట్టారు.

దీనికితోడు ఉమ కుమారుడు రవితేజ కూడా ప‌వ‌న్ కు వీరాభిమాని కావ‌డం కూడా పార్టీ నేత‌ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది

రవితేజ జనసేన అధినేత పవన్ కు పిచ్చి ఫ్యాన్.పవన్ సినిమా విడుదలంటే చాలు విజయవాడలో అతడు చేసే హడావుడి అంతా ఇంతా కాదు.

పవన్ కల్యాణ్ విజయవాడ వచ్చినా ఆయనను కలిసేందుకు ముందు వరుసలో ఉంటాడు రవితేజ.ఇలా బోండా ఉమా కొడుకు వ్యవహారం అధికార టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.

పవన్ పార్టీలోకి తండ్రీ, కొడుకులు జంప్ అవుతారని సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ కు కొందరు బోండాపై ఫిర్యాదు చేశారు.ఆయ‌న కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన వెళ్లిపోతే వెళ్లనివ్వండి అని అధినేత టీడీపీ సీనియర్ నేతల దగ్గర అన్నట్లు సమాచారం.

మ‌రి ఈ వ్య‌వ‌హారం ఎంత‌వ‌ర‌కూ వ‌స్తుందో వేచిచూడాలి!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube