Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

చిరు కోసం ఇద్ద‌రు బాలీవుడ్ భామ‌లు..!-Bollywood Heroines For Chiranjeevi

మెగాస్టార్‌ చిరంజీవి తాజా చిత్రం ఉయ్య‌ల‌వాడ న‌ర్సింహారెడ్డి సినిమా త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. కొణిదెల ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై చిరు త‌న‌యుడు రాంచ‌ర‌ణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో చిరు ప‌క్క‌న హీరోయిన్‌గా ఇద్ద‌రు బాలీవుడ్ భామ‌ల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి.

ప్రియాంక‌చోప్రా లేదా సోనాక్షి సిన్హాల‌లో ఎవ‌రో ఒక‌రిని ఈ హిస్టారిక‌ల్ మూవీలో హీరోయిన్‌గా సెట్ చేస్తార‌ని టాక్‌. సోనాక్షి సిన్హా గ‌తంలో రజనీకాంత్‌ సరసన లింగా చిత్రంలో న‌టించిన‌ప్ప‌టి నుంచి ఆమెను తెలుగు సినిమాల్లో న‌టింప‌జేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

ఇటీవ‌ల మ‌హేశ్‌బాబు సినిమాలో ఛాన్స్‌ను సైతం ఆమె రిజెక్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక ప్రియాంకా చోప్రా కూడా తెలుగులో చిరు త‌న‌యుడు చెర్రీ స‌ర‌స‌న జంజీర్ (తెలుగులో తుఫాన్‌) సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సినిమాకు ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్‌.రెహ్మ‌న్ పేరును ప‌రిశీలిస్తున్నారు. ఈ మేర‌కు డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి ఇప్ప‌టికే రెహ్మ‌న్‌తో భేటీ అయ్యి ప్రాథ‌మిక చ‌ర్చ‌లు కూడా జ‌రిపిన‌ట్టు స‌మాచారం.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంలో ముగ్గురు మహిళల‌కు ఇంపార్టెన్స్ రోల్ ఉంటుంద‌ట‌. ఈ రోల్స్‌కు ఐశ్వ‌ర్యారాయ్‌, విజ‌య‌శాంతి, అందాల తార శృతీహాస‌న్ పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం.

Continue Reading
More Posts
To Top