తెలంగాణా ఐటీ మంత్రి కే తారకరామారావు ఇప్పుడు అందరికీ ఆమోగ్య యోగ్యుడుగా మరారుతున్నారు, ఇప్పటికే యూత్ అందరికీ ఈయన మీద ఒక మంచి ఆసక్తికర ఒపీనియన్ ఉండగా సెలెబ్రిటీ లు సైతం ఈయనకి ప్రసంసల వర్షం కురిపించడం విశేషం.కేటీఆర్ కొత్త ఇంటికి అనుమతి పొందడం కోసం మొక్కలు కంపల్సరీ గా నాటాలి అనే రూల్ ని తప్పని సరి చెయ్యాలనే ప్రతిపాదన పెట్టగా దానికి వివేక్ ఒబరాయ్ నుంచి భారీ మద్దతు లభించింది.
రెండోవిడత హరితహారం సందర్భంగా మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ”అకౌంట్ లో ఇంటి నిర్మాణానికి అనుమతులు పొందాలంటే తప్పనిసరిగా కొన్ని మొక్కలు నాటాలనే నిబంధన తేవాలని అనుకుంటున్నాం.నీటిని పొదుపుచేయడంతో పాటు ఈ నిబంధన కూడా పెట్టాలని ఆలోచన చేస్తున్నాం”అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ కు సోషల్ మీడియా భారీ స్పందనలే వచ్చాయి.
ఈ స్పందనల్లో వివేక్ ఒబెరాయ్ ఒకరు ‘రామ్ అన్నా.
మీ నిర్ణయం అద్భుతమైనదే కాకుండా అభివృద్ధికి దారులు వేసేది కూడా.మీకు మరింత శక్తి లభించాలని కోరుకుంటున్నాను.
ఈ నిర్ణయం తప్పనిసరి చేయడం ద్వారా కాంక్రీట్ అడవిగా మారిపోయిన మన నగరం ఆకుపచ్చగా మారుతుంది’ అని సంతోషం వ్యక్తం చేస్తూ రీట్వీట్ చేశారు.దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ ‘థ్యాంక్యూ వివేక్ మీ స్పందన ప్రశంసనీయం’ అంటూ రీట్వీట్ చేశారు.