రాజధానిలో 'బోగస్' ఓటర్లు!!!

ప్రస్తుత ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో బోగస్ ఓటర్ల జాబితా ప్రకంపనలు రేపుతుంది.వివరాల్లో కి వెళితే…తాజాగా రాధానిలో చేపట్టిన బోగస్ ఓట్ల ఏరివేత కార్యక్రమంలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి.

 Bogus Votes List In Hyderabad-TeluguStop.com

మొత్తం ఓటర్లలో బోగస్ ఓట్లు 32 నుంచి 45 శాతం ఉన్నట్లు గతంలో పైలెట్ ప్రాజక్టు కింద 15పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన సర్వేలో తేలటం ప్రాధాన్యం సంతరించుకుంది.నగరంలో ఏ ఎన్నికలు జరిగినా పోలింగ్ 52నుంచి 53శాతానికి మించడం లేదు.

దీనికి ప్రధాన కారణం బోగస్ ఓటర్లేనని అధికారులు గుర్తించారు.గత సాధారణ ఎన్నికల సందర్భంగా కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్ తదితర నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు నగరంలో ఓటువేసి, అటు ఆంధ్రాలో సైతం ఓటుహక్కును వినియోగించుకున్నట్లు ఆరోపణలున్నాయి.

ఈ నేపథ్యంలో, బోటస్ ఓట్లను ఏరివేయాలని సంకల్పించిన ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం గత సాధారణ ఎన్నికలకు ముందు నాంపల్లి, ఖైరతాబాద్, కార్వాన్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి తదితర ఐదు అసెంబ్లీస్థానాల్లోని మొత్తం 15పోలింగ్ కేంద్రాల్లో సర్వే చేపట్టి ఆధార్ అనుసంధాన కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజక్టు కింద నిర్వహించారు.బోగస్ ఓటర్లు ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది.

గమ్మత్తు ఏమిటంటే.చనిపోయిన వారి ఓట్లు కూడా ఇంకా ఓటర్ల లిస్ట్ లో ఉండడం గమనార్హం.

ఏది ఏమైనా ఈ లెక్కను సరైన సమయంలో సరి చేయకపోతే మున్ముందు చాలా ఇబ్బందులు తప్పవు అనే చెప్పుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube