'నల్ల' వివరాలు ఆన్‌లైన్‌లో చెప్పొచ్చు

విదేశాల్లోని నల్ల డబ్బును భారత్‌కు రప్పించలేని మోదీ సర్కారు, ఆ వివరాలు చెప్పాలనుకున్న కుబేరులకు రకరకాల సౌకర్యాలు కల్పిస్తోంది.సౌకర్యాలంటే ఆ వివరాలు చెప్పడానికి మార్గాలన్నమాట.

 Black Money Declaration Of Overseas Stash Can Be Done Online-TeluguStop.com

నల్ల కుబేరులు నేరుగా ఆదాయపు పన్ను అధికారులకు చెప్పొచ్చు.అంటే వివరాలు రాత పూర్వకంగా ఇవ్వొచ్చు.

అలా వీలుకాని వారు ‘ఆన్‌లైన్‌’లో చెప్పొచ్చు.జూలై ఒకటో తేదీ నుంచి మూడు నెలల లోపల నల్ల ధనం వివరాలు చెప్పాల్సి ఉంటుంది.

దీన్ని ‘వన్‌టైమ్‌ కంప్లయిన్‌్స విండో’ అని వ్యవహరిస్తున్నారు.దీని కింద వివరాలు చెప్పినవారికి ముప్పయ్‌ శాతం మాత్రమే పన్ను పడుతుంది.

అపరాధ రుసుము కూడా చాలా తక్కువగా ఉంటుంది.అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నల్లధనం కుబేరుల వివరాలు వెల్లడిస్తామని చెప్పిన మోదీ సర్కారు ఇప్పటివరకు ఆ పని చేయలేకపోయింది.

ఇప్పుడు ఆన్‌లైన్లో చెప్పండి అంటోంది.ఎంతమంది ఈ పని చేస్తారు? చేయకపోతే సర్కారు వారి మీద ఏం చర్యలు తీసుకుంటుంది తెలియదు.విదేశాల్లోని నల్లధనం ఇండియాకు రప్పిస్తే దేశంలోని దరిద్రం తీరుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.నల్లధనం వస్తే ఐదేళ్లవరకు దేశంలోని పేద ప్రజలందరికీ ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేయవచ్చని అంటున్నారు.

ఇదే కాదు ఎన్నెన్నో పనులు బ్రహ్మాండంగా చేయొచ్చు.కాని ఆ నల్లధనం రాదు.

వచ్చినా కొద్దిగా తప్ప భారీగా వచ్చే అవకాశం లేదు.నల్ల కుబేరులకు ‘తాయిలాలు’ ఎరవేసి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇవన్నీ ఫలితాలు ఇవ్వవు.ఇవన్నీ కంటితుడుపు చర్యలే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube