'కమల' హస్తంలో 'కడప'

వైఎస్ఆర్ జిల్లా.అలియాస్ కడప జిల్లా…దాదాపు కొన్ని దశాబ్దాలుగా కడప జిల్లాను తమ కంచు కోటగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు వైఎస్ఆర్ అండ్ ఫ్యామిలీ.

 Bjp Tries To Take Over Kadapa?-TeluguStop.com

అయితే గత ఎన్నికల వరకు కడప జిల్లాను తమ హస్తంలో బందించిన వైఎస్ఆర్ అండ్ కో, ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆ పట్టును కోల్పోతున్నారు అని తెలుస్తుంది.గత ఎన్నికల్లో టీడీపీ దాదాపు గెలిచినంత పనిచేసింది.

చివరికి ఓటమిపాలైనప్పటికీ తన బలాన్ని మాత్రం పుంజుకుంది మరోపక్క వైకాపా తన బలాన్ని కోల్పోయింది.ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు కడప పై పడింది కమలం కన్ను, వైకాపాను ఇప్పుడు ఇరకాటంలో పడేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది.

రాబోయే రోజుల్లో భారతీయ జనతాపార్టీకీ అనుకూలమవుతాయన్న ఆశతో కమలంపార్టీలోకి మిగతా పార్టీ నాయకులు జంపింగ్ చేస్తున్నారు.జిల్లా కేంద్రమైన కడపతో పాటు కడప పార్లమెంటు పరిధిలో బలమైన నాయకత్వం కలిగిన కందుల సోదరులు బిజెపీలోకి అడుగు పెడుతున్నారు.

కడప జిల్లా పర్యటనకు వస్తున్న వెంకయ్యనాయుడు సమక్షంలో కడప మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డితో పాటు ఆయన సోదరుడు కె.రాజమోహన్ రెడ్డి, వారి అనుచరులు పార్టీ కండువా కప్పుకోనున్నారు.అలాగే జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలకు చెందిన మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా బిజెపిలోకి అడుగు పెడుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.మరోపక్క ఇప్పటికే పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే బీజెపీతో జతకట్టి పార్టీకి కడపలో బలం పెంచుతున్నారు.

మరి ఇలానే వలసలు కొనసాగితే మాత్రం చివరకు కడపలో వైకాపా ప్రస్థానం ఖాళీ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube