ఏపీలో ఆ కులాన్ని టార్గెట్ చేసిన బీజేపీ

ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు ఎప్పుడు ఎలా మార‌తాయో కూడా ఎవ్వ‌రూ ఊహించ‌డం లేదు.జ‌న‌సేన ఎంట్రీతో ఇప్ప‌టికే ఇక్క‌డ రాజ‌కీయం ముక్కోణంగా మారింది.

 Bjp Targets Kshatriya Community In Andhra Pradesh-TeluguStop.com

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొన్ని ఏరియాల్లో జ‌న‌సేన ఎఫెక్ట్ గ‌ట్టిగానే ఉండ‌నుంది.ఇదిలా ఉంటే ఇక్క‌డ సొంతంగా ఎదిగేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోన్న బీజేపీ ర‌క‌ర‌కాల ప్లాన్లు వేస్తోంది.

వాస్త‌వానికి తెలంగాణ‌లో బీజేపీ క‌న‌ప‌రుస్తోన్న దూకుడు ఏపీలో క‌న‌ప‌ర‌చ‌డం లేదు.ఇక్క‌డ అధికార టీడీపీతో బీజేపీ పొత్తు ఉండ‌డంతో బీజేపీ సొంతంగా ఎదిగేందుకు తెర‌వెన‌కే ప్ర‌య‌త్నాలు చేస్తుందే త‌ప్ప డైరెక్ట్‌గా బ‌ల‌ప‌డేందుకు చేస్తోన్న ప్ర‌య‌త్నాలేవి పెద్ద‌గా ఫ‌లించ‌డం లేదు.

ఇక ఇటీవ‌ల తెలుగు రాష్ట్రాల‌పై స్పెష‌ల్‌గా కాన్‌సంట్రేష‌న్ చేస్తోన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పక్కా ప్రణాళికతో ఏపీలో తమ రాజకీయ చరుతర ప్రదర్శిస్తున్నారు.అందులో భాగంగా ఏపీలో క్ష‌త్రియ సామాజిక‌వ‌ర్గాన్ని పూర్తిగా త‌మ వైపున‌కు తిప్పుకునే వ్యూహాలు ఆయ‌న ర‌చిస్తున్నార‌ని తెలుస్తోంది.

ఇటీవ‌ల రాష్ట్రంలో జ‌రుగుతోన్న కొన్ని ప‌రిణామాలు సైతం ఇందుకు ఊత‌మిచ్చేలా ఉన్నాయి.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం కేంద్రంగా క్ష‌త్రియ క‌మ్యూనిటీని బీజేపీ వైపు మ‌ళ్లించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

తాజాగా కేంద్ర‌మంత్రి అశోక్‌గ‌జ‌ప‌తిరాజు సైతం భీమ‌వ‌రంలో దీపం ప‌థ‌కం అమ‌లులో రాష్ట్ర ప్ర‌భుత్వం దారుణంగా విఫ‌ల‌మైతే కేంద్రం ఈ విష‌యంలో సూప‌ర్ స‌క్సెస్ అయ్యింద‌ని మెచ్చుకున్నారు.ఆయ‌న క్ష‌త్రియు కోట భీమ‌వ‌రంలో ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం వెన‌క చాలా పెద్ద స్కెచ్చే ఉంద‌న్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

బీజేపీకి ముందునుంచి హిందూత్వ‌, బ్రాహ్మ‌ణ‌, క్ష‌త్రియ క‌మ్యూనిటీల‌కు అనుకూల‌మైన పార్టీగా పేరుంది.ఇప్పుడు అమిత్ షా దీనిని బేస్ చేసుకుని ఏపీలో ఉన్న క్ష‌త్రియులంద‌రిని బీజేపీ వైపున‌కు మ‌ళ్లించేలా కొత్త రాజ‌కీయం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఏపీలో బ్రాహ్మ‌ణ‌, క్ష‌త్రియ‌ రెండు వర్గాలని తమ వైపు తెచ్చుకునే ప్రయత్నంలో వున్నట్లు తెలుస్తుంది.

ఏపీలో క్ష‌త్రియులంద‌రూ బీజేపీలోకి వ‌స్తే వారిని లీడ్ చేసే బాధ్య‌త‌ల‌ను కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజుకు అప్ప‌గిస్తార‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇటీవ‌ల టీడీపీలో అశోక్ గ‌జ‌ప‌తిరాజు ప్రాబ‌ల్యం త‌గ్గుతూ వ‌స్తోంది.ఈ క్ర‌మంలోనే ఆయ‌న కాస్త అసంతృప్తితోనే ఉన్నార‌న్న వార్తలు వ‌స్తున్నాయి.

ఇక అశోక్ బీజేపీలో చేరినా ఆయ‌న్ను రాజ్య‌స‌భ‌కు పంపి ఎలాగూ కేంద్ర‌మంత్రిని చేస్తారు.ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆధ్వ‌ర్యంలో క్ష‌త్రియుల‌ను బీజేపీ గూటికి లాగేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌.

మ‌రి ఈ ప్ర‌య‌త్నంలో అమిత్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతారో ? చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube