ఏపీ బీజేపీకి గొయ్యి త‌వ్వుతోందెవ‌రు..!

ఏపీలో బీజేపీ స‌మాధికి గొయ్యి రెడీ అవుతోందా ? ఈ గొయ్యిని వేరే పార్టీ వాళ్లు కాకుండా ఆ పార్టీ నేత‌లే త‌వ్వుకుంటున్నారా ? ఏపీలో బీజేపీ ప‌రిస్థితి అయిపోయిందా ? అంటే అవున‌నే ఆన్స‌ర్ విన‌వ‌స్తోంది.బీజేపీకి స‌మాధి రెడీ అయ్యింద‌నే మాట ఆ పార్టీ ప‌రిస్థితి ఇక్క‌డ ఎంత దిగ‌జారింతో అర్ధ‌మ‌వుతోంది.

 Bjp Group Politics In Ap-TeluguStop.com

2014 ఎన్నిక‌ల్లో ఏపీ, తెలంగాణ‌ల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఏపీలో మాత్రం చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేరి రెండు మంత్రి ప‌ద‌వులు కొట్టేసింది.ఏపీ, తెలంగాణ‌లో కేవ‌లం 9 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాల్లో ఆ పార్టీ విజ‌యం సాధించింది.

ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో సొంతంగా ఎద‌గాల‌ని బీజేపీ నేత‌లు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు.కాంగ్రెస్‌లో కేంద్ర‌, రాష్ట్ర స్థాయిలో మంత్రి ప‌ద‌వులు అనుభ‌వించి వ‌చ్చిన సీనియ‌ర్లు ఓ బ్యాచ్‌గా, ఇక స్టేట్ క‌మిటీలో ఉన్న వారిలో సీఎం చంద్ర‌బాబుకు అనుకూలంగా ఉండే బ్యాచ్ ఒక‌టి, చంద్ర‌బాబును తీవ్రంగా వ్య‌తిరేకించే మూడో బ్యాచ్ ఇలా ఏపీ బీజేపీలో గ్రూపుల‌కు కొద‌వేలేదు.

ఈ మూడు గ్రూపులకు అస్స‌లు పొస‌గ‌డం లేదు.సీనియ‌ర్లు టీడీపీతో పొత్తును తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.2019లో బీజేపీ సొంతంగా పోటీ చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు.ఇక బాబుకు అనుకూలంగా ఉండే బ్యాచ్ నిత్యం బాబు భ‌జ‌నే చేస్తున్నార‌ని వైరి వ‌ర్గం ఆరోపిస్తోంది.

సీనియ‌ర్ బ్యాచ్ మాత్రం త‌మ‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో తీవ్ర నిర్వేదంతో ఉంది.ఇక ఏపీ టీడీపీ కూడా మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీకి కీల‌క ప‌ద‌వులు, నామినేటెడ్ పోస్టులు ఇస్తుంద‌న్న గ్యారెంటీ లేదు.

ఈ క్ర‌మంలో బీజేపీలో చాలా మంది 2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేయ‌డ‌మే బెట‌ర్ అన్న డెసిష‌న్‌కు వ‌చ్చేశారు.పార్టీలో ఉండి గుర్తింపు లేద‌నుకున్న‌వారు ప్ర‌త్యామ్నాయం చూసుకుంటున్నారు.

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో మాజీ ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు వైకాపా పంచ‌కు చేరుకున్నారు.ఈయ‌న బాట‌లోనే మ‌రికొంద‌రు బీజేపీ నేత‌లు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

క‌నీసం బీజేపీ ఇన్‌చార్జ్‌లు కూడా పార్టీ మారుతుంటే వారిని నియంత్రించ‌లేని ప‌రిస్థితి ఉందంటే ఏపీలో బీజేపీ నేత‌లే ఆ పార్టీకి గొయ్యి త‌వ్వేసుకుంటున్నట్టు చ‌ర్చ న‌డుస్తోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube