సూపర్‌ హిట్‌ అనుకుంటే డిజాస్టర్‌ అయ్యింది

గత కొంత కాలంగా టాలీవుడ్‌ వర్గాల వారు మరియు ప్రేక్షకులు అంతా కూడా సంక్రాంతి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.భారీ స్థాయిలో అంచనాలున్న ‘నాన్నకు ప్రేమతో’, ‘డిక్టేటర్‌’, ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రాలు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

 Biggest Disaster In Balayya Carrier..!-TeluguStop.com

ఈ మూడు సినిమాలు కూడా ప్రేక్షకుల్లో అంచనాలను తారా స్థాయిలో ఉన్నాయి.ఈ మూడు చిత్రాల్లో ‘నాన్నకు ప్రేమతో’ మరియు ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రాలు పర్వాలేదు అన్నట్లుగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

అయితే బాలకృష్ణ నటించిన 99వ చిత్రం ‘డిక్టేటర్‌’ మాత్రం చెత్త టాక్‌ను తెచ్చుకుంది.

బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ‘డిక్టేటర్‌’ చిత్రం భారీ ఫ్లాప్‌ను చవి చూసింది.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘డిక్టేటర్‌’ చిత్రం విడుదలకు ముందు 25 కోట్ల బిజినెస్‌ చేసిందంటూ వార్తలు వచ్చాయి.అయినా కూడా చిత్రంపై నమ్మకంతో 50 కోట్ల బడ్జెట్‌ను రికవరీ చేయడం ఖాయం అని నిర్మాతలు మరియు దర్శకుడు భావించాడు.కాని బాలయ్య 50 కోట్లను వసూళ్లు చేయడం అసాధ్యం అని తేలిపోయింది.20 కోట్లకు మించి కలెక్షన్స్‌ను రాబట్టలేదు అంటూ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.దాంతో బాలయ్య కెరీర్‌లో ఇదో పెద్ద డిజాస్టర్‌ అంటూ సినీ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.బాలకృష్ణ తన పరిధి, మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని సినిమాలు చేయాలని ఆయన ఫ్యాన్స్‌ మరియు విశ్లేషకులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube