జగన్ పాదయాత్రలో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్..ఇదే

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి.పాదయాత్రపైనే ఇప్పుడు అందరి దృష్టి…నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర దాదాపు ఆరు నెలలపాటు 125 శాసనసభ నియోజకవర్గాల మీదుగా సాగనుంది.

 Big Twist In Ys Jagan Mohan Reddy Padayatra-TeluguStop.com

ఎప్పుడు చేసే పాదయాత్రలే గా అని అందరూ ఫిక్స్ అయ్యారు.కానీ ఇప్పుడు జగన్ పాదయాత్రలో ట్విస్ట్ ఉందని చెప్తున్నారు.

ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఒకటే చర్చ.ఇంతకీ ఆ ట్విస్ట్ ఏమిటంటే.

తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి తాజాగా తండ్రిలానే పాదయాత్ర చేపట్టడానికి సిద్ధం అవుతున్నారు.వైఎస్ రాజశేఖర్ అంటే గుర్తొచ్చేది నిండైనపంచెకట్టు.

ఎంతో హుందాగా.దర్జాగా.

తెలుగుదనం ఉట్టిపడేలా ఉండే రాజశేఖర్ రెడ్డి రైతుల మనిషిలా కనిపిస్తారు.ఇప్పుడు జగన్ కూడా పాదయాత్రలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలాగానే పంచెకట్టుతో కనిపించనున్నారు అనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

జగన్ యాత్ర ఎలా సాగబోతోంది.తన తండ్రిలానే పంచెకట్టులో కనిపించబోతున్నారా? లేక ఎప్పుడులానే ఫార్మల్స్ లో కనిపిస్తారా అని చర్చలుజరుగుతున్నాయి.జగన్ పంచె కట్టులో కనిపిస్తారు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటి నుంచీ నెటిజన్లు.పంచెకట్టుకి సపోర్ట్ చేస్తున్నారు.

వైసీపీ సీనియర్ నాయకులు కూడా జగన్ దగ్గర ఈవిషయాన్ని వెల్లడించారట.ఈ మాటలకి జగన్ నవ్వి ఊరుకున్నారు అని తెలిసింది.

ఐతే.విశ్లేషకులు కూడా జగన్ పాదయాత్ర పంచెకట్టులో చేస్తే జనాలకి బాగా దగ్గర అవుతారు.మళ్ళీ రాజశేఖర్ రెడ్డి ని గుర్తు చేసినట్టుగా ఉంటుంది.అని చెప్తున్నారు.

జగన్ పాదయాత్రకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి.పాదయాత్రకు ముందే జగన్ అన్ని వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు.

పంచెకట్టులో పాదయాత్ర చేస్తే.ప్రజలకి బాగా దగ్గర అవుతారు అందరూ భావిస్తున్నారు.

జగన్ రెడ్డి కూడా ఈ విషయంలో సుముఖంగా ఉన్నారు అని తెలుస్తోంది.మరి నవంబర్ 2 తేదీన పాదయాత్ర మొదలైతే కానీ అసలు విషయం తెలిసేలా లేదు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube