కాంగ్రెస్ పార్టీ కి దిమ్మ తిరిగే షాక్

కొద్ది రోజులుగా తెలంగాణ పిసిసి అధినేత ఉత్త‌మ కుమార్ రెడ్డి `ఉత్త‌`ముడంటూ వ్యంగ్య వ్యాఖ్యానాల‌తో కాంగ్రెస్ రాజ‌కీయాల‌ను ర‌స‌కందాయంలో దింపిన మాజీ మంత్రి కోమ‌టి రెడ్డి త‌న సోద‌రుడితో క‌ల‌సి కారెక్క‌బోతున్న‌ట్లు క‌నిపిస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల క‌థ‌నం.ఇందుకోస‌మే తెలంగాణ‌ కాంగ్రెస్ పార్టీకి తక్షణమే సర్జరీ చేయాలని, .

 Komati Reddy Brothers Join In Trs-TeluguStop.com

లేకపోతే పార్టీని పోస్ట్ మార్టం చేసే పరిస్థితి వస్తుందని శ‌నివారం మీడియాలో చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్ప‌డం ఖాయ‌మ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇటీవ‌ల సొంత వ్య‌వ‌హారాల‌పై అమెరికా ప‌ర్య‌ట‌నకు వెళ్లిన కోమ‌టి రెడ్డి హైద‌రాబాద్‌కు రాగానే తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ను క‌ల‌వ‌టం స‌తం హాట్ టాపిక్‌గా అయ్యింది.

హరీష్ రావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ జేయ‌టానికే వెళ్లానని వెళ్లాన‌ని కోమటి రెడ్డి చెప్తున్నా, వాస్త‌వం అది కాద‌ని, స‌న్నిహితుల నుంచి విన‌వ‌స్తోంది.

నల్లగొండ జిల్లా సాగు నీటి ప్రాజెక్టులపై చ‌ర్చ‌లు జ‌రిపాన‌ని, ఎలాంటి రాజకీయ చర్చలు జ‌ర‌గ‌లేద‌ని బైట‌కు చెపుతున్నా, ఇప్ప‌టికే కారెక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్న ఎం.పి గుత్తా సుఖేంద్ర‌రెడ్డితో పాటు కోమ‌టిరెడ్డి గులాబీ కండువా క‌ప్పుకునే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.మ‌రి రెండు, మూడు రోజుల‌లో కోమ‌టిరెడ్డి సోద‌రుల వ్య‌వ‌హారం ఓ కొలిక్కి వ‌చ్చే ఆస్కారం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube