సంచలనాత్మక షో బిగ్ బాస్ రికార్డు తీఆర్పితో దూసుకుపోతోంది.మొదటి ఎపిసోడ్ కి రికార్డు టీఆర్పి రాబట్టిన ఈ రియాలిటి షో, రెండోవవారం మరింత పెరిగిన టీఆర్పితో జనాలకి ఆకట్టుకుంది.
అయితే ఈ రియాలిటి షోలో జరుగుతున్నది అంతా రియాలిటి కాదేమో.పెద్ద పెద్ద రూల్స్ చెబుతారు కాని, అందులో కొన్నిటికీ సడలింపులు ఉన్నట్లు ఉంది.
బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఇంట్లో ఉన్న వారు ఫోన్ వాడరాదు.అది ఒకే, ఇంతవరకు ఎవరిదగ్గర ఫోన్ చూడలేదు.
మధ్యమధ్యలో సేల్ఫీ తీసుకుంటున్న ఫోన్లు ఎలాగో టాస్క్ లో భాగం.టీవి లేదు, బయటి వ్యక్తితో కనెక్షన్ లేదు.
వంట వాళ్ళే వండుకోవాలి.బాత్ రూమ్స్ వారే శుభ్రం చేసుకోవాలి, అలాగే ఎవరి బట్టలు వారే ఉతుక్కోవాలి.
మరి బాత్ రూమ్స్ నిజంగానే శుభ్రం చేసుకుంటున్నారా లేదో తెలియదు కాని బట్టలు మాత్రం వాళ్ళే ఉతుక్కోవట్లేదు ఏమో.
అదేంటి .జ్యోతి వెళుతూ వెళుతూ ప్రిన్స్ మీద బిగ్ బాంబ్ వేసిందిగా, దాంతో ప్రిన్స్ ఇంట్లో ఉన్న అందరి బట్టలు తానే ఉతకాల్సి వచ్చిందిగా అని అడుగుతున్నారా ? ప్రిన్స్ బట్టలు ఉతుకుతుండగా ఒకేఒకసారి చూసాం మనం.తను పనిష్ మెంట్ సమయంలో అందరి బట్టలు ఉతికే ఫుటేజ్ ఎలాగో మన దగ్గర లేదు.అలాగే మిగితావారు బట్టలు ఉతుక్కోవడం కూడా మనం చూడలేదు
‘ఈ ఫోటోని జాగ్రత్తగా గమనించండి.కత్తి కార్తిక, అర్చన కూర్చొని ఉన్నారు, ఆదర్శ్, ముమైత్, దీక్ష మరియు ధనరాజ్ నిల్చొని ఉన్నారు.లగ్జరీ బడ్జెట్ టాస్క్ అప్పుడు ఇలా ఇక్కడే ఉండాల్సి వచ్చింది వారు’.ఇంతేనా మీ సమాధానం ? సరిగా అబ్జర్వ్ చేయండి.ధన్ రాజ్ పక్కన ఓ రూమ్ కనబడిందా ? ఆ రూమ్ లో ఏముంది ? అది వాషింగ్ మిషిన్ కాదా ? చూసారా దొరికేసారు !
ఎవరి బట్టలు వాళ్ళే పిండుకోవడం రూల్ కదా, ఎవరి బట్టలు వాళ్ళే వాషింగ్ మిషిన్ లో వేసుకుంటారేమో అనకండి, ఎందుకంటే ప్రిన్స్ బాత్ రూమ్ దగ్గర చేత్తో బట్టలు పిండుతున్నట్లు ఆల్రేడి మనకు చూపించారు.మరి ఇంట్లో వాషింగ్ మెషిన్ ఏం చేస్తోంది ? ఇక్కడ వాషింగ్ మెషిన్ ఉండటం తప్పు కాదు, ఎవరి బట్టలు వారే పిండుకుంటారాని జనాలకి చెప్పడం తప్పు.రేపు ఇంకో తప్పు దొరికితే జనాలకి షో మీద నమ్మకం పోదా?
.