"బిచ్చగాడు" వసూళ్లు 16కోట్లు..

చదలవాడ తిరుపతిరావు సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’ ను తెలుగులో ‘బిచ్చగాడు’ అనే పేరుతో మే 13న విడుదల చేసిన విషయం విదితమే.ఆడియెన్స్ మౌత్ టాక్ తో స్లో గా స్టార్ట్ అయి నేటి వరకు స్డడీ గా వసూళను సాధిస్తూ భారీ విజయాన్ని అందుకుంది.6వ వారంలో సైతం అన్ని ప్రాంతాల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

 Bichagadu Movie Box Office Collections-TeluguStop.com

ఇప్పటి వరకు 16కోట్ల వరకు వసూళ్లను రాబట్టి ట్రెడ్ వర్గాల వారిని ఆశ్చర్య పరిచింది.

జులై 1కు యాభై రోజులను కంప్లీట్ చెసుకొనున్న బిచ్చగాడు 20కోట్ల క్లబ్ లొకి చెరనుందని టాక్.‘’మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి బిచ్చగాడు సినిమా మరోసారి నిరూపించింది.

నిర్మాత చేసిన ప్రమోషన్స్ కూడా కలెక్షన్స్ ను ప్రభావితం చేశాయి .

అన్నీ ఏరియాస్ లో ఊహించిన దాని కంటే పెద్ద విజయాన్ని అందుకుంది.విజయ్ ఆంటోని అద్భుతమైన నటన, సంగీతం, డైరెక్టర్ శశి టేకింగ్ సహా ప్రతి ఎలిమెంట్ సినిమాలో చక్కగా కుదిరాయి.ముఖ్యంగా సినిమాలోని మదర్ సెంటిమెంట్, ఎమోషనల్ పాయింట్స్ సహా చాలా సన్నివేశాలకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube