నిజంగానే భలే భలే మొగాడివోయ్‌!

టాలీవుడ్‌లో టాలెంట్‌తో పైకి వచ్చిన హీరోలు చాలా తక్కువ మంది అని చెప్పాలి.బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తనకంటూ ఒక ప్రత్యేక స్థానంను సంపాదించుకున్న హీరో నాని.

 Bhale Bhale Magadivoy Team Praise Nani-TeluguStop.com

ఈయన నటించిన ప్రతి సినిమాలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ఈయన నటించిన ఒక్కో సినిమాతో నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వెళ్లాడు.

ఈ మధ్య నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో నాని కనబర్చిన నటన అద్బుతం అని చెప్పాలి.

ప్రస్తుతం నాని ‘భలే భలే మొగాడివోయ్‌’ సినిమాలో నటిస్తున్నాడు.

బూతు చిత్రాల దర్శకుడిగా పేరున్న మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.అల్లు అరవింద్‌ సమర్పణలో ఈ సినిమాను బన్నీ వాసు, వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు.

ఈ సినిమా క్లైమాక్స్‌లో ఒక ఎమోషనల్‌ సీన్‌ ఉంటుంది.దాని ప్రాధాన్యత దృష్టా ఎక్కడ కూడా కట్‌ చెప్పకుండా కంటిన్యూస్‌గా చిత్రీకరించాలని దర్శకుడు భావించాడు.

అయితే అంత లెంగ్తీ డైలాగ్స్‌ చెప్పాలంటే ఏ హీరోకు అయినా చాలా కష్టం.కాని నాని ఈ విషయం చెప్పగానే చేద్దాం అన్నాడు.

అన్నట్లుగానే ఏకంగా ఎనిమిది పేజీల లెంగ్తీ డైలాగ్స్‌ను చాలా సునాయాసంగా చెప్పేశాడు.ఆ సీన్‌ చిత్రీకరణ పూర్తి అవ్వగానే చిత్ర యూనిట్‌ సభ్యులు మొత్తం నానికి చప్పట్లతో సత్కారం చేశారు.

నువ్వు నిజంగానే భలే భలే మొగాడివోయ్‌ అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు నానితో అన్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube