పవర్‌ స్టామినాపై బెట్టింగ్‌లు

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రం మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇప్పటికే ఈ చిత్రం కోసం ఫ్యాన్స్‌ కౌంట్‌ డౌన్‌ ప్రారంభించారు.

 Bettings On Power Star Stamina-TeluguStop.com

భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకునేలా ఉంటుందని, తప్పకుండా ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో నిర్మాతలు మరియు దర్శకుడు ఉన్నాడు.

దాంతో ఈ చిత్రంపై జోరుగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి

ఆంధ్రా ఏరియాతో పాటు పలు ఏరియాల్లో ఈ బెట్టింగ్‌లు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.కలెక్షన్స్‌పై ఈ బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.

మొదటి రోజు కలెక్షన్స్‌, రెండవ రోజు కలెక్షన్స్‌, మొదటి వారాంతం కలెక్షన్స్‌, మొదటి వారం కలెక్షన్స్‌, లాంగ్‌ రన్‌ కలెక్షన్స్‌ అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు బెట్టింగ్‌లు వేసుకుంటున్నారు.వేలు మరియు లక్షల్లో ఈ బెట్టింగ్‌లు కాస్తున్నట్లుగా సినీ వర్గాల నుండి విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

పవన్‌కు ఏస్థాయి క్రేజ్‌ ఉందో ఈ బెట్టింగ్‌లు చూస్తేనే అర్థం అవుతోంది.ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పవన్‌ తన ఫ్యాన్స్‌ను పూర్తి స్థాయిలో తృప్తిపర్చుతాడో చూడాలి.

తారా స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను హిందీలో సైతం విడుదల చేయనున్న విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube