జామ ఆకులతో ఎన్ని లాభాలున్నాయో తెలుసా!-Healthy Benefits Of Guava Leaves 2 months

 Photo,Image,Pics-

పెరట్లోనే ఉంటుంది కాబట్టి జామ చులకన. జామపండ్లనే సరిగా పట్టించుకోనప్పుడు జామ ఆకులని ఏం పట్టించుకుంటారులేండి. కాని పట్టించుకోవాలి. జామ ఆకులలో ఎన్ని అద్భుతాలు దాగున్నాయో తెలిస్తే మీరు తప్పకుండా పట్టించుకుంటారు.

* జామ ఆకులని నీళ్ళలో మరిగించి రోజూ తాగటం అలవాటు చేసుకుంటే బ్యాడ్ కొలెస్టిరాల్ లెవెల్స్ ని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు. అలాగే డయాబెటిస్ కి చెక్ పెట్టవచ్చు.

* లివర్ పనిచేసే తీరుని మెరుగుపరుస్తాయి జామ ఆకులు. జామాకు – నీరు .. ఈ మిశ్రమాన్ని లివర్ టానిక్ అని కూడా అంటారు.

* కొన్నిసార్లు బయటి తిండి తినడం వలన ఫుడ్ పాయిజనింగ్ జరగవచ్చు. అలాగే వాంతులు రావొచ్చు. అలాంటప్పుడు జామ ఆకులు పనిచేస్తాయి.

* జీర్ణక్రియ మెరుగుపడటానికి జామపండ్లే కాదు, జామ ఆకులు కూడా సహాయం చేస్తాయి. ఇందులో ఉండే ఎంజీమ్స్ మన కడుపుకి మంచి నేస్తాలు.

* డెంగ్యూతో బాధపడేవారికి జామ ఆకులు నీటిలో మరిగించి తాగిస్తే ఫలితం ఉంటుంది. జామ ఆకులు రక్తంలో ప్లేట్లేట్స్ సంఖ్య పెంచుతాయి.

* జామాకులు తరుచుగా తినటం వలన వీర్య ఉత్పత్తి కూడా మెరుగుపడుతుందని కొన్ని పరిశోధనలు చెప్పాయి.

* గాయాలపై జామ ఆకులు పిండి ఆ పసరుని రాయడం వలన ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే ఇందులో యాంటి బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి.

* చర్మం యొక్క అందానికి కూడా జామ ఆకులు పనిచేస్తాయి. ఇవి మొటిమలు, మొటిమల వచ్చిన మచ్చలపై ప్రభావం చూపగలవు. అలాగే దురద లాంటి సమస్యని తగ్గిస్తాయి.

మీ కోసం సూచించబడిన ఈ హెల్త్ టిప్స్ చూడండి...ఒంట్లో కొవ్వు పెరిగితే ఎన్ని ప్రమాదాలో చూడండి

About This Post..జామ ఆకులతో ఎన్ని లాభాలున్నాయో తెలుసా!

This Post provides detail information about జామ ఆకులతో ఎన్ని లాభాలున్నాయో తెలుసా! was published and last updated on in thlagu language in category AP Featured,Telugu Health,Telugu Health Tips.

Healthy benefits of Guava leaves, Liver Function, Dengue, Digestion Problems, Gauva Leaves, Allergy

Tagged with:Healthy benefits of Guava leaves, Liver Function, Dengue, Digestion Problems, Gauva Leaves, Allergy,