Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

చద్దన్నంలో ఉండే అద్భుతమైన లాభాలు తెలిస్తే రోజు చద్దన్నం మానకుండా తింటారు-Best Health Benefits Of Fermented Rice

పూర్వ కాలంలో ఇంటిలో ప్రతి ఒక్కరు ఉదయం చద్దన్నం తినేవారు. రోజుని చద్దన్నం తినటంతోనే ప్రారంభించేవారు. ఈ రోజుల్లో అయితే ఎవరు చద్దన్నం తినటానికి పెద్దగా ఆసక్తి చూపటం లేదు.

రకరకాల టిఫిన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ చద్దన్నంలో చాలా పోషక విలువలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే వావ్ అంటారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

రాత్రి వండిన అన్నాన్ని ఉదయం పెరుగు, ఉల్లిపాయతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు తినటం లేదు. పల్లెలో అయితే రాత్రి మిగిలిన అన్నాన్ని పశువులకు పెడుతున్నారు. కానీ చద్దన్నం లో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే తినాలని అనిపిస్తుంది.

ఉదయం టిఫిన్ కి బదులు చద్దన్నం తింటే హుషారుగా ఉండటమే కాకుండా పొట్ట తేలికగా ఉంటుంది.

చద్దన్నం లో ఉండే లాక్టిక్ యాసిడ్ పొటాషియం,ఐరన్ గా మారటం వలన బిపి వంటివి రావు.

తాజాగా వండిన అన్నంతో పోలిస్తే చద్దన్నంలో కేలరీలు తక్కువగా ఉండుట వలన బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది.

విటమిన్స్ లో బి6,బి12 అనేవి చాలా అరుదుగా ఉంటాయి. ఎక్కువగా సప్లిమెంట్స్ మీద ఆదారపడవలసి ఉంటుంది. అయితే చద్దన్నంలో బి6,బి12 విటమిన్స్ సమృద్దిగా లభిస్తాయి.

చద్దన్నంలో మంచి బ్యాక్టీరియా ఉండుట వలన జీర్ణ సమస్యలను తగ్గించటమే కాకుండా రోగ కరకాల మీద పోరాటం చేయటానికి రోగ నిరోదక శక్తిని అందిస్తుంది.

చద్దన్నం తినటం వలన ఎముకల సమస్యలు,చర్మ ఎలర్జీలు, పొట్ట సమస్యలు రావు.

ప్రతి రోజు చద్దన్నం తింటే వయస్సు ప్రభావం కనపడకుండా యవ్వన్నంగా ఉండేలా చేస్తుంది.

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu News

  • News

    Kill my father – says Ravi Babu on Chalapathi Rao

    By

    రోజులు గడుస్తున్నాయి, అయినా చలపతిరావు వివాదం ఇంకా తాజాగనే ఉంది. రోజుకో ఛానెల్ లో డిబేట్, దాంట్లోకి మహిళా సంఘాలవారు రావడం,...

  • Genral

    8 biggest myths around alcohol

    By

    మంచి నీళ్ళు, టీ (మిల్క్ టీ ఒక్కటే కాదు, హర్బల్ టీ లాంటివి కలుపుకొని), వీటి తర్వాత మద్యం (బీర్). విస్కీ,...

  • Devotional

    Unbelievable facts about the sacred Mount Kailasa

    By

    కైలాస పర్వతం. సాక్షాత్తుగా ఆదియోగి పరమశివుడు నివాసముండే ప్రాంతం. యుగయుగాలుగా పంచాక్షరీ మంత్ర జపంతో మారుమోగుతున్న పవిత్ర ప్రాంతం.కేవలం హిందువులకే కాదు,...

  • News

    YS Jagan Tension Over increase in MLA Seats

    By

    అవును! నిజ‌మే! ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాల‌ను 225 కి పెంచాల‌న్న విభ‌జ‌న చ‌ట్టంలోని క్లాజుల‌కు అనుగుణంగా ఏదో...

To Top