పుచ్చకాయ గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు

పుచ్చకాయ గింజలలో పోషకాలు మరియు ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి.వాటిలోని పోషకాలు శరీరానికి అందాలంటే పుచ్చకాయ గింజలను బాగా నమిలి మింగాలి.ఇప్పుడు పుచ్చకాయ గింజలతో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

 Best Benefits Of Watermelon Seeds-TeluguStop.com

1.శరీరానికి అమైనో ఆమ్లాల అవసరం ఉంటుంది.అయితే శరీరం సొంతంగా అమైనో ఆమ్లాలను ఉత్పత్తి చేసుకోలేదు.

అది లైసిన్ ఆహార వనరుల నుంచి అందించాల్సి ఉంటుంది.పుచ్చకాయ గింజలలో ట్రిప్టోఫాన్ మరియు గ్లుటామిక్ ఆమ్లాలు అనే అవసరమైన అమైనో ఆమ్లాలు కొన్ని ఉంటాయి.లైసిన్ కొల్లాజెన్ ఆకృతికి మరియు కాల్షియం శోషణ సహాయపడుతుంది.

2.100 గ్రాముల పుచ్చకాయ గింజలలో 136 గ్రాముల మెగ్నీషియం ఉంటుంది.ఇది మన రోజువారీ అవసరాలకు సరిపోతుంది.

మెగ్నీషియం అనేది సాధారణ గుండె పనితీరు, సాధారణ రక్తపోటు నిర్వహణ, జీవ క్రియా విధానానికి మద్దతు మరియు ప్రోటీన్ సంశ్లేషణ కోసం ఎంతో కీలకమైనది.అలాగే రక్తపోటు మరియు మధుమేహంను నియంత్రించడంతో పాటు హృదయ వ్యాధులు మరియు రక్తపోటు చికిత్సలో సహాయకారిగా ఉంటుంది.

3.పుచ్చకాయ గింజలలో లైకోపీన్ సమృద్దిగా ఉండుట వలన ముఖానికి మంచిది.అలాగే పురుషులకు సంతానోత్పత్తిలో సహాయపడుతుంది.

4.ఈ గింజల్లో మల్టీవిటమిన్ B యొక్క అద్భుతమైన వనరులు ఉండుట వలన కొన్ని మందులను భర్తీ చేస్తాయి.పుచ్చకాయ గింజలలో విటమిన్ బి, నియాసిన్, ఫోలేట్, థియామిన్, రిబోఫ్లావిన్, విటమిన్ B6 మరియు పాంతోతేనిక్ యాసిడ్ ఉంటాయి.B విటమిన్లు ఆరోగ్యకరమైన రక్తం, నాడీ వ్యవస్థ మరియు సమర్థవంతమైన రోగనిరోధక ప్రతిస్పందనను నిర్వహించడానికి చాలా ముఖ్యం.

5.ఈ గింజలు మధుమేహం చికిత్స కోసం బాగా సహాయపడతాయి.ఒక లీటర్ నీటిలో పుచ్చకాయ గింజలను వేసి 45 నిముషాల పాటు మరిగించి, వడకట్టి ఆ టీని ప్రతి రోజు త్రాగాలి.

6.పుచ్చకాయ గింజలు వ్యాధి అనంతరం ఆరోగ్య స్వస్థత మరియు మెమరీని పదునుపెట్టటానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube