కొబ్బరినీళ్ళు రెగ్యులర్ గా ఎందుకు తాగాలి?-Benefits That Come With Regular Intake Of Coconut Water 1 month

Coconut Water High Sugar Drinks Hydrate Indigestion Workouts Photo,Image,Pics-

కొబ్బరినీళ్ళు కాలంతో సంబంధం లేకుండా బయట రోడ్డు మీదే చవకగా దొరుకుతాయి. అలాంటి మినరల్స్ కలిగిన నేచురల్ డ్రింక్ మనకి అందుబాటులో ఉన్నా, దాన్ని రెగ్యులర్ గా తాగితే శరీరానికి ఎంతో మేలు చేసినవారవుతారని తెలిసినా, చాలామంది అలసత్వం ప్రదర్శిస్తారు. మీరే అలోచించండి చివరిసారిగా కొబ్బరినీళ్ళు ఎప్పుడు తాగారో? గుర్తుపెట్టుకోడవం కష్టంగా అనిపిస్తే, ఇకనుంచైనా కొబ్బరినీళ్ళు రెగ్యులర్ గా తాగండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి .. ఎందుకంటే!

* కొబ్బరినీళ్ళు కిడ్నీల ఆరోగ్యానికి చాలా మంచివి. పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉండటం వలన మలినాలు త్వరగా ఫ్లష్ అవుట్ అవుతాయి. అలాగే కిడ్నిల్లో ఏర్పడే రాళ్ళపై కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి కొబ్బరినీళ్ళు.

* శరీరం ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండాలి. డీహైడ్రేట్ అయిన బాడిని వెంటనే హైడ్రైట్ చేస్తాయి కొబ్బరినీళ్ళు. అందుకే, ఎండకాలంలో పెద్దగా ఆలోచించకుండా కొబ్బరినీళ్ళపై మనసు పారేసుకుంటాం.

* అజీర్ణము సమస్యతో బాధపడేవారు డిస్పెప్సియాతో ఇబ్బందులు పడకతప్పదు. కాని కడుపులో వాటి వల్ల ఎలాంటి సమస్యలు వచ్చినా, కొబ్బరినీళ్ళు తాగడం ఫస్ట్ ఏడ్ లాంటిది. ఎందుకంటే ఇంఫ్లేమేషన్ ని తరిమే మెగ్నేషియం, పొటాషియం, సోడియం, కాల్షియం వంటి మినరల్స్ దీంట్లో ఉంటాయి. కొబ్బరినీళ్ళలో అరటిపండుని మించిన పొటాషియం ఉండటం విశేషం.

* వర్క్ అవుట్స్ తరువాత శక్తి కోసం ఎనర్జీ డ్రింక్స్ మీద పడే బదులు కొబ్బరినీళ్ళు తాగితే మంచిది. మీకు ఎనర్జీని ఇచ్చే మినరల్స్ అన్ని ఉంటాయి.

* హై షుగర్ డ్రింక్స్ కి బదులు కొబ్బరినీళ్ళు తాగడం వలన బరువు తగ్గాలనుకునేవారు త్వరగా బరువు తగ్గవచ్చు. అలాగే తినడానికి అరగంట ముందు కొబ్బరినీళ్ళు తాగితే మంచిది. ఫైబర్ కంటెంట్ బాగా ఉండటం వలన మీరు అతిగా తినకుండా అడ్డుకుంటాయి కొబ్బరినీళ్ళు.

మీ కోసం సూచించబడిన ఈ హెల్త్ టిప్స్ చూడండి...కిడ్నీల్లో రాళ్ళు తీసేయడానికి ఒక జ్యూస్ ఉంది

About This Post..కొబ్బరినీళ్ళు రెగ్యులర్ గా ఎందుకు తాగాలి?

This Post provides detail information about కొబ్బరినీళ్ళు రెగ్యులర్ గా ఎందుకు తాగాలి? was published and last updated on in thlagu language in category AP Featured,Telugu Health,Telugu Health Tips.

Benefits that come with regular intake of Coconut Water, Coconut Water, Hydrate, Workouts, High Sugar Drinks, Indigestion

Tagged with:Benefits that come with regular intake of Coconut Water, Coconut Water, Hydrate, Workouts, High Sugar Drinks, IndigestionBenefits that come with regular intake of Coconut Water,coconut water,High Sugar Drinks,Hydrate,indigestion,workouts,,