స్త్రీలు ముక్కు పుడక పెట్టుకోవటంలో అందంతో పాటు ఆరోగ్యం కూడా....ఎలా ?

స్త్రీ యొక్క అందం గురించి చెప్పినప్పుడు కను ముక్కు తీరు బాగుందని అనటం మనం తరచుగా వింటూనే ఉంటాం.స్త్రీ ముఖం చూడగానే స్త్రీ అందంలో ముక్కు ప్రధానమైన పాత్రను పోషిస్తుందని అనటంలో అతిశయోక్తి లేదు.

 Benefits Of Wearing Nose Ring-TeluguStop.com

అందుకే చాలా మంది కవులు ముక్కు మీద కవితలు,పద్యాలు రాసేశారు.అటువంటి ముక్కుకు ముక్కు పుడక రెట్టింపు అందాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.

పూర్వ కాలంలో ప్రతి స్త్రీ ముక్కు పుడక పెట్టుకోవటం ఆచారంగా ఉండేది.అయితే ముక్కు పుడక పెట్టుకోవటం వలన అందంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది.ఎడమ శ్వాసను ‘చంద్ర స్వరం’ అనీ … కుడి శ్వాసను ‘సూర్య స్వరం’అని అంటారు.అందువలన ముక్కుకు ఎడమ వైపున అర్థ చంద్రాకారంలోని ముక్కు పుడక … కుడి వైపున మండలాకారమైన ఒంటి రాయి ముక్కు పుడక ధరించాలని శాస్త్రం చెబుతోంది

ప్రతి రోజు స్త్రీలు ఎన్నో పనులను చేస్తూ చాలా బిజీగా ఉండటం సహజమే.

అందువల్ల వారికీ ఎటువంటి శ్వాస సంబంధమైన వ్యాధులు రాకుండా ముక్కు పుడక కాపాడుతుంది.అందువల్ల మన పెద్దవారు స్త్రీలు తప్పని సరిగా ముక్కు పుడక ధరించాలని నియమం పెట్టారు.

పూర్వ కాలంలో ముక్కు పుడకను అడ్డబేసరి అని పిలిచేవారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube