అందానికి, ఆరోగ్యానికి మేలు చేసే....ఆవిరి

సాధారణంగా మనకు జలుబు చేసినప్పుడు ఆవిరి పడతాం.కానీ ఆవిరి ఆరోగ్యానికే కాదు అందానికి కూడా బాగా సహాయపడుతుంది.

 Benefits Of Face Steaming-TeluguStop.com

ఇప్పుడు అందానికి ఆవిరి ఎలా సహాయాపడుతుందో తెలుసుకుందాం.

రెండు గ్లాసుల నీటిని మరిగించి అందులో నిమ్మగడ్డి లేదా పుదీనా ఆకులు వేసి ఆవిరి పడితే జలుబు నుండి ఉపశమనం కలగటమే కాకుండా ముఖం తాజాగా మారుతుంది.

నీటిని బాగా మరిగించి ఆయుర్వేద మూలికలు వేసి ముఖానికి ఆవిరి పడితే ముఖం మీద ఉన్న దుమ్ము,ధూళి తొలగిపోయి తాజాగా ఉంటుంది.

మరిగే నీటిలో కొన్ని చుక్కల కొబ్బరినూనె వేసి ఆవిరి పడితే ముఖం పొడిబారకుండా తేమగా ఉంటుంది.

రోజంతా అలసిన కండరాలకు ఉపశమనం పొందటానికి ఆవిరి ఎంతో సహాయాపడుతుంది.ఆవిరి పట్టినప్పుడు కండరాలు ఉత్తేజితమై కీళ్ల నొప్పులు మాయం అవుతాయి.అంతేకాక జీవక్రియ రేటు మెరుగుపడుతుంది.

సైనసైటిస్,ఆస్తమా,అలర్జీ వంటి సమస్యలు ఉన్నప్పుడు శ్వాస నాళాలు పూడుకుపోతాయి.

ఇలాంటప్పుడు ఆవిరి పడితే శ్వాస నాళాలు శుభ్రపడి శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తొలగిపోతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube