Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

50 ఏళ్ల తరువాత శృంగారం వలన శరీరానికి ఏమిటి లాభాలు ?-Benefits Of $ex For Human Body After 50 Years

50 ఏళ్ళు వచ్చాయి అంటే ముసలివాళ్ళ లెక్కలలోకి వేసేస్తారు. శరీరంలో జరిగే మార్పులు అలాంటివి మరి. బీపి పెరగటం, తగ్గటం, షుగర్ సమస్యలు, కీళ్ళ నొప్పులు, నిద్ర సమస్యలు, మతిమరుపు ఇలా చెప్పుకుంటూ పొతే పెద్ద లిస్టు తయారవుతుంది. ఈ వయసులో ఉన్నవారికి అతిపెద్ద వైద్యం ఏమిటో తెలుసా ? ప్రేమ, శృంగారం. అంతే ప్రేమించే భాగస్వామి ఉండి, ఇద్దరికీ ఇంకా శృంగారంలో ఆసక్తి ఉంటే ఎన్నోరకాల ఆరోగ్య సమస్యల ప్రభావాన్ని తగ్గించడమే కాదు, పూర్తిగా బయటపడతారు కూడా. చూడండి మీరే ఆ వయసులో శృంగారం వలన శరీరానికి దొరికే లాభాలు ఏమిటో !

* ప్రోస్టేట్ క్యాన్సర్ రావడానికి ఒక కారణం టేస్టోస్టేరోన్ లెవల్స్ తగ్గిపోవడం. ఈ హార్మోన్ పురుషుడి శరీరంలో ఎక్కువ మొత్తంలో విడుదల అవుతున్నంత కాలం ప్రోస్టేట్ మీద క్యాన్సర్ కణాలు దాడి చేయడం అంత సులభమైన విషయం కాదు. 30 ఏళ్ళు దాటినతరువాత పురుషుడిలో టేస్టోస్టేరోన్ లెవల్స్ క్రమంగా తగ్గుతుంటూ ఉంటాయి. కాని రెగ్యలర్ గా శృంగారం చేయడం వలన బ్యాలన్స్ మెయింటేన్ చేయవచ్చు. ఇక 50 ఏళ్లలో ఈ హార్మోన్ లెవల్స్ ఎంత తక్కువ ఉంటాయో మీరే ఊహించుకోండి. కాబట్టి 50 ఏళ్ళు దాటినా, మంచి శృంగార జీవితం ఉంటే పురుషుడు టేస్టోస్టేరోన్ హార్మోన్ లెవల్స్ బాగా ఉండటం వలన ప్రోస్టేట్ ప్రమాదం నుంచి దూరంగా ఉంటాడు.

* శృంగారం వలన ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. మనిషిలో ప్రశాంతతకు, నిద్రకు ఈ హార్మోన్ అవసరం చాలా ఉంటుంది. 50 ఏళ్ళు దాటిన తరువాత మనిషి క్రమంగా మంచి నిద్రకు దూరం అవుతూ ఉంటాడు. ఎందుకంటే శరీరం బలహీనం అవుతూ ఉంటుంది కాబట్టి. అందుకే శృంగారం చేయడం వలన ప్రశాంతమైన నిద్ర పొందవచ్చు.

Continue Reading
More Posts
To Top