మజా మజా మొక్కజొన్న వర్షాకాలంలో ఎందుకు తినాలో తెలుసా

సన్నని చినుకులు పడుతూ ఉన్న సమయంలో మొక్కజొన్న తింటే ఆ అనుభూతి వేరే…మాటల్లో వర్ణించలేము.మొక్కజొన్నలో ఎ, బి, సి, ఇ విటమిన్లూ, కొన్ని ఖనిజాలూ కూడా సమృద్ధిగా ఉంటాయి.

 Sweet Corn, Winter Season, Vitamin C, Corn Health Benefits-TeluguStop.com

మొక్కజొన్నకు కాస్త నిమ్మకాయ రాసుకుని తినడంవల్ల శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, నియాసిన్‌… వంటి పోషకాల శాతం మరింత పెరుగుతుంది.ఇన్ని పోషకాలు ఉన్న మొక్కజొన్న మన ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుందో చూద్దాం.

మొక్కజొన్నలో థైమీన్‌, నియాసిన్‌ అనే విటమిన్లు సమృద్ధిగా ఉండుట వలన నాడీ వ్యవస్థ పనితీరులో సహాయపడుతుంది.

మొక్కజొన్నలో పాంటోథెనిక్‌ ఆమ్లం,పీచు ఎక్కువగా ఉండుట వలన జీవక్రియకు దోహదపడుతుంది.

దాంతో మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడటంలో సహాయపడుతుంది.
మొక్కజొన్నలో విటమిన్‌ బి12, ఐరన్ మరియు ఫోలిక్‌ యాసిడ్‌లు సమృద్ధిగా ఉండుట వలన రక్తహీనత రాకుండా కాపాడుతుంది.

ఇవి ఎర్ర రక్త కణాల ఏర్పాటులో సహాయపడతాయి.

రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేయటం వలన గుండెపోటు, పక్షవాతం,బిపి వంటివి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మొక్కజొన్నలో సమృద్ధిగా ఉండే విటమిన్ సి, కెరోటినాయిడ్స్, మరియు బయోఫ్లెవనాయిడ్స్ కొలస్ట్రాల్ పెరగకుండా చూడటం వలన గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ.

మొక్కజొన్నలో ఉండే కార్బోహైడ్రేట్స్ శరీరానికి కావల్సిన ఎనర్జీని అందిస్తుంది.

దాంతో బ్రెయిన్ , నాడీవ్యవస్థ కూడా చురుగ్గా పనిచేస్తాయి.
తీపి మొక్కజొన్నలో వుండే విటమిన్‌ సి, కేరోటియాయిడ్లు మరియు మయో ప్లేవినాయిడ్లు చెడు కొలెస్టరాల్ ని తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

మొక్కజొన్నలో విటమిన్ బి సమృద్ధిగా ఉండుట వలన హైపర్ టెన్షన్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది.

మొక్కజొన్నలో ఉండే ఫైటోకెమికల్స్‌ శరీరంలో ఇన్సులిన్‌ శాతాన్ని నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర నిల్వలు పేరుకోకుండా చేస్తుంది.

మొక్కజొన్న, తగినంత పరిమాణంలో వినియోగించుకుంటే, మధుమేహంతో బాధపడే వారికి చాలా మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube