చర్మ సౌందర్యానికి.....పసుపు

పసుపులో సహజ ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి.పసుపులో ఆరోగ్యపరమైన ప్రయోజనాలే కాకుండా అందాన్ని మెరుగు పరిచే గుణాలు చాలా ఉన్నాయి.

 Beauty Benefits Of Turmeric Powder-TeluguStop.com

ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక స్పూన్ పసుపు, రెండు స్పూన్ల గందం పొడిలో సరిపడా పాలను చేర్చి పేస్ట్ గా చేసుకోవాలి.

ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా ఒక నెల రోజుల పాటు చేస్తే యాక్నే,మొటిమల సమస్యల నుండి దూరం అవటమే కాక మొటిమల మచ్చలు కూడా తగ్గిపోతాయి.

పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాతో పోరాటం చేస్తాయి.

జిడ్డు సమస్యతో బాధపడేవారికి పసుపు ప్యాక్ మంచి పరిష్కారాన్ని చూపుతుంది.

రెండు స్పూన్ల గందం పొడి,చిటికెడు పసుపు,రెండు స్పూన్ల కమలా రసం కలిపి పేస్ట్ చేసుకోవాలి.దీనిని ముఖానికి పట్టించి ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పసుపులో ఉండే గుణాలు చర్మంలో ఉత్పత్తి అయ్యే సిబం ను నియంత్రిస్తుంది.

ముఖంపై సన్నని గీతలు ఉంటే…ఒక కప్పు బియ్యంపిండిలో చిటికెడు పసుపు, కొంచెం పచ్చి పాలు, రెండు స్పూన్ల టమోటా రసం కలిపి పేస్ట్ చేసుకోవాలి.

ఈ పేస్ట్ ని ముఖానికి,మెడకు,చేతులకు రాసుకొని పది నిముషాలు అయ్యాక శుభ్రం చేసుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube