జాబ్ ఇంటర్వ్యూలో మంచి మార్కుల కోసం ఏం చేయాలి

ప్రస్తుతం ఉన్న పోటి ప్రపంచంలో కేవలం గవర్నమెంటు జాబుల కోసమే ప్రయత్నించట్లేదు జనాలు.ప్రపంచీకరణ వలన ఎన్నో మల్టి నేషనల్ కంపెనీలు మన దేశంలోకి వచ్చాయి.

 Basic Tips For Facing An Interview Perfectly-TeluguStop.com

ఆ ప్రైవేటికరణ వలన ఎన్నో ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి.కేవలం ప్రభుత్వ ఉద్యోగాల మీదే ఆధారపడకుండా ఏమ్బియే, ఇంజనీరింగ్ చేస్తూ కంపెనీల్లో జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

కాని అక్కడా కూడా పోటియే.వంద మంది ఇంటర్వ్యూకి వెళితే అందులో 5-6 ఉద్యోగాలు వస్తున్నాయి.

మిగితా 90% పైగా మంది ఎప్పటిలాగే రోడ్డు మీద తిరుగుతున్నారు.ఇలా ఎందుకు జరుగుతోంది అంటే ఇంటర్వ్యూని సరిగా ఎదుర్కొనకపోవడం వలన.అందుకే ఇంటర్వ్యూని బాగా ఎదుర్కోవాలంటే ఏం చేయాలో సలహాలు ఇస్తున్నాం చూడండి.

* మొదట మీరు ఇంటర్వ్యూ ఏ కంపెనీకి ఇవ్వబోతున్నారో ఆ కంపెనీ గురించి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయాలి.

అంటే ఆ కంపెని గురించి బేసిక్ వివరాలు తెలుసుకోవాలి.ఈ కంపెని గురించి ఏం తెలుసు అనే ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది.అలాగే ఈ కంపెనీలో జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు అనే ప్రశ్న కూడా వస్తుంది.దానికి మెప్పు పొందే సమాధానం ఇవ్వాలి.

* క్లీన్ షేవ్ చేసుకోండి.గడ్డం, మీసం వద్దు.

ఫార్మల్ డ్రెస్ వేసుకొని హుందాగా ఉండాలి.ఇంటర్వ్యూ రూమ్ లోకి ఎంటర్ అవగానే మంచి బాడి లాంగ్వేజ్ తో ఉండాలి.

కుర్చిని చప్పుడు లేకుండా లాగాలి.

* మీరు CV లో ఏమైతే హాబీలు, ఇంటరెస్ట్ రాసిపెట్టారో, వాటి గురించి ప్రశ్నలు అడగవచ్చు.

ఉదాహరణకు క్రికెట్ రాసి ఉంటే, భారతీయ క్రికెట్ జట్టు మొదటి కెప్టెన్ ఎవరు అనే ప్రశ్న అడగొచ్చు.

* ఇంగ్లీష్ వస్తేనే మాట్లాడండి.

లేదంటే మీ మాతృభాషలో మాట్లాడతానని ముందే చెప్పండి.అంతే తప్ప వచ్చి రాని ఇంగ్లీష్ తో బ్యాడ్ ఇంప్రెషన్ తెచ్చుకోవద్దు.

* మీరు సమాధానాలు చెబుతున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, మిమ్మల్ని ఇంటర్వ్యూ నలుగురు చేస్తున్నారు అనుకోండి, ఆ నలుగురి కళ్ళల్లో కళ్ళుపెట్టి మాట్లాడండి.కేవలం ఒకరివైపే చూస్తూ సమాధానం ఇవ్వొద్దు.

అలాగే దిక్కులు చూస్తూ సమాధానం ఇవ్వొద్దు.

* సబ్జెక్ట్ నాలెడ్జి ఎలాగో ముఖ్యం కాని, కేవలం బుకిష్ నాలెడ్జీ కాకుండా, ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించండి.

మీరు చెప్పే సమాధానాలలో కొన్ని నిజజీవితం లోంచి తీసుకున్న అంశాలను చొప్పిస్తే మంచి ఇంప్రెషన్ పడుతుంది.

* ఇంటర్వ్యూ మొదటి నుంచి చివరి దాకా, నవ్వుతూ మాట్లాడండి.

మీరు ఒక introvert అని వారు అనుకుంటే మీ అవకాశాలు సన్నగిల్లుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube