Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

జాబ్ ఇంటర్వ్యూలో మంచి మార్కుల కోసం ఏం చేయాలి -Basic Tips For Facing An Interview Perfectly

ప్రస్తుతం ఉన్న పోటి ప్రపంచంలో కేవలం గవర్నమెంటు జాబుల కోసమే ప్రయత్నించట్లేదు జనాలు. ప్రపంచీకరణ వలన ఎన్నో మల్టి నేషనల్ కంపెనీలు మన దేశంలోకి వచ్చాయి. ఆ ప్రైవేటికరణ వలన ఎన్నో ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. కేవలం ప్రభుత్వ ఉద్యోగాల మీదే ఆధారపడకుండా ఏమ్బియే, ఇంజనీరింగ్ చేస్తూ కంపెనీల్లో జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాని అక్కడా కూడా పోటియే. వంద మంది ఇంటర్వ్యూకి వెళితే అందులో 5-6 ఉద్యోగాలు వస్తున్నాయి. మిగితా 90% పైగా మంది ఎప్పటిలాగే రోడ్డు మీద తిరుగుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే ఇంటర్వ్యూని సరిగా ఎదుర్కొనకపోవడం వలన. అందుకే ఇంటర్వ్యూని బాగా ఎదుర్కోవాలంటే ఏం చేయాలో సలహాలు ఇస్తున్నాం చూడండి.

* మొదట మీరు ఇంటర్వ్యూ ఏ కంపెనీకి ఇవ్వబోతున్నారో ఆ కంపెనీ గురించి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయాలి. అంటే ఆ కంపెని గురించి బేసిక్ వివరాలు తెలుసుకోవాలి. ఈ కంపెని గురించి ఏం తెలుసు అనే ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఈ కంపెనీలో జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు అనే ప్రశ్న కూడా వస్తుంది. దానికి మెప్పు పొందే సమాధానం ఇవ్వాలి.

* క్లీన్ షేవ్ చేసుకోండి. గడ్డం, మీసం వద్దు. ఫార్మల్ డ్రెస్ వేసుకొని హుందాగా ఉండాలి. ఇంటర్వ్యూ రూమ్ లోకి ఎంటర్ అవగానే మంచి బాడి లాంగ్వేజ్ తో ఉండాలి. కుర్చిని చప్పుడు లేకుండా లాగాలి.

* మీరు CV లో ఏమైతే హాబీలు, ఇంటరెస్ట్ రాసిపెట్టారో, వాటి గురించి ప్రశ్నలు అడగవచ్చు. ఉదాహరణకు క్రికెట్ రాసి ఉంటే, భారతీయ క్రికెట్ జట్టు మొదటి కెప్టెన్ ఎవరు అనే ప్రశ్న అడగొచ్చు.

* ఇంగ్లీష్ వస్తేనే మాట్లాడండి. లేదంటే మీ మాతృభాషలో మాట్లాడతానని ముందే చెప్పండి. అంతే తప్ప వచ్చి రాని ఇంగ్లీష్ తో బ్యాడ్ ఇంప్రెషన్ తెచ్చుకోవద్దు.

* మీరు సమాధానాలు చెబుతున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, మిమ్మల్ని ఇంటర్వ్యూ నలుగురు చేస్తున్నారు అనుకోండి, ఆ నలుగురి కళ్ళల్లో కళ్ళుపెట్టి మాట్లాడండి. కేవలం ఒకరివైపే చూస్తూ సమాధానం ఇవ్వొద్దు. అలాగే దిక్కులు చూస్తూ సమాధానం ఇవ్వొద్దు.

* సబ్జెక్ట్ నాలెడ్జి ఎలాగో ముఖ్యం కాని, కేవలం బుకిష్ నాలెడ్జీ కాకుండా, ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించండి. మీరు చెప్పే సమాధానాలలో కొన్ని నిజజీవితం లోంచి తీసుకున్న అంశాలను చొప్పిస్తే మంచి ఇంప్రెషన్ పడుతుంది.

* ఇంటర్వ్యూ మొదటి నుంచి చివరి దాకా, నవ్వుతూ మాట్లాడండి. మీరు ఒక introvert అని వారు అనుకుంటే మీ అవకాశాలు సన్నగిల్లుతాయి.

Continue Reading
More Posts
To Top