పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు చేసే తప్పులు ఇవి

స్త్రీ శరీరానికి తప్పని ఇబ్బందే పీరియడ్స్.నిజానికి స్త్రీ అస్తిత్వానికి పీరియడ్స్ అవసరమైన, పీరియడ్స్ ని ఇష్టంగా ఏ మహిళా స్వీకరించలేదు.

 Basic Mistakes Women Do In Periods-TeluguStop.com

కాని శరీర నిర్మాణం ప్రకారం తప్పదుగా.

చాలామంది స్త్రీలు అవగాహనరాహిత్యం వలన అప్పటికే కష్టంగా ఉన్న పీరియడ్స్ ని కొన్ని తప్పులు చేసి మరింత కష్టంగా మార్చుకుంటారు.

మరి ఆ తప్పులెంటో చూడండి ఓసారి.

* చాలామంది స్త్రీలు పీరియడ్స్ సమయంలో మలబద్దకం, మోషన్స్, కడుపు ఉబ్బటం లేదా కడుపు నొప్పి లాంటి సమస్యలతో ఇబ్బందిపడతారు.

ఈ సమస్యలు వేరైనా ఒకే కారణం వీటి వెనుక ఉండవచ్చు.అదే తిండి ఎగ్గొట్టడం.

అవును ఓ పూట ఆహారం తీసుకోకపోయినా ఇబ్బందే.పీరియడ్స్ లో డైట్ బాగా పాటించాలి.

సమయానికి మంచి ఆహారం తప్పకుండా తీసుకోవాలి.

* రక్తం రంగుని గమనించాలి పీరియడ్స్ లో.రంగులో మార్పులు జరిగితే డాక్టర్ ని మొహమాటం లేకుండా సంప్రదించాలి.అలాగే చూస్తూ ఉండటం తప్పు.

* కొందరు హైజిన్ సరిగా మెయింటేన్ చేయరు.పీరియడ్స్ లో ఉన్నా, నలుగురితో కలిసే ఉండాలి కాబట్టి హైజిన్ బాగా ముఖ్యం.

ప్యాడ్స్ ఎప్పటికప్పుడు మార్చుకోవాలి.బయట తిరుగుతున్నప్పుడు వచ్చే ఇబ్బంది పక్కనపెడితే, ప్యాడ్స్ చాలాసేపు ఉంచుకోవడం వలన ఇన్ఫెక్షన్స్ వస్తాయి.

* పీరియడ్స్ లో ఎట్టి పరిస్థితులలోనూ రక్షణ లేని శృంగారం వద్దు.సామాన్యంగా పీరియడ్స్ సమయంలో సుఖవ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువ.

కాబట్టి అలాంటి తప్పులు చేయవద్దు.

* ప్రతీసారి మీ పీరియడ్స్ ట్రాక్ చేయడం ముఖ్యం.

చాలామంది ఇక్కడే పెద్ద తప్పు చేస్తారు.ఋతుక్రమం ఎప్పుడు మొదలయ్యింది, ఏ సమయంలో, ఇలాంటి రికార్డ్స్ గుర్తుంచుకోరు.

పీరియడ్స్ సైకిల్ ఓ ట్రాక్ లో ఉంటేనే మీ ఆరోగ్యం ట్రాక్ లో ఉన్నట్లు.

* అతిగా విశ్రాంతి తీసుకోవడం కూడా తప్పే.

విశ్రాంతి తీసుకోవాల్సిందే కాని శరీరం కదులుతూ ఉండాలి కూడా.లేదంటే క్రామ్ప్స్ ఇంకా ఎక్కువ అవుతాయి.

* ఇక పీరియడ్స్ సమయంలో మహిళలు మద్యం ముట్టకపోతేనే మంచిది.పోరపాటులో ఆ తప్పు చేసారో, క్రామ్ప్స్ మరింత ఎక్కువ అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube