ప్రసవం జరిగిన తరువాత భర్త చేయాల్సిన పనులు

రసవం జరగక ముందు మాత్రమే కాదు, ప్రసవం జరిగిన తరువాత కూడా మహిళలు తమ శరీరం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.ఎందుకంటే ప్రసవించిన తరువాత కూడా స్ట్రీ శరీరం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది.

 Basic Duties Of Husband After She Delivered A Baby-TeluguStop.com

డెలివరి సమయంలో నొప్పులు, రక్తాన్ని కోల్పోవాడం, నీరసంగా అనిపించడం, యోని లోంచి వాసనతో కూడిన డిశ్చార్జ్, ఒళ్ళంతా నొప్పులు .అబ్బో ఇవన్ని డెలివరి తరువాత మహిళలు చూసే సమస్యలే.ఈ సమయంలో ఇన్ఫెక్షన్స్ బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది.ఏ పని చేయడానికి శరీరం సహకరించదు.బలం కావాలి, రక్తం కావాలి, రోగనిరోధక శక్తి కావాలి .ఇవన్ని మహిళకి తిరిగి రావాలంటే, ఆమె శరీరాన్ని ఆమె మాత్రమే కాదు,భాగస్వామి కూడా పట్టించుకోవాలి.డెలివరి తరువాత ఆమె అవసరాలు ఏంటో చెబుతున్నాం చూడండి.

* మానసికంగా, శారీరకంగా .ఆమెకి విశ్రాంతి అవసరం.అలాగని ఆమె ఉన్నచోటే కూర్చునివ్వొద్దు.

కొంచెం నడవమనండి, నడిపించండి, రక్తం బాగా సర్కిలేట్ అయ్యేలా, చిన్నపాటి వ్యాయామాలు చేయించండి.ఓ ప్రశాంతమైన వాతావరణం ఆమెకి ఇవ్వండి.

* డెలివరి తరువాత ఇన్ఫెక్షన్స్ బెడద పెరుగుతుందని చెప్పుకున్నాం కదా.అందుకే డాక్టర్ దగ్గరికి రెగ్యులర్ గా తీసుకెళ్ళాలి.బ్లడ్ చెకప్, బీపి చెకప్, షుగర్ చెకప్ కి తీసుకెళ్ళాలి.గర్భంలో గాయాలు అవుతాయి .ట్రీట్ చేయించాలి.అనేమియా సమస్య ఎక్కువ ఉంటుంది ఈ సమయాల్లో … అందుకే చెకప్ కంపల్సరి.

రిపోర్ట్స్ ని బట్టి డైట్ ప్లాన్ చేయాలి.ఇక యురినరి ఇన్ఫెక్షన్స్ ఎలాగో ఉంటాయి.

నీళ్ళు బాగా తాగించాలి.యూరిన్ ఎలా వస్తుందో ఆమెని మొహమాటం లేకుండా అడగండి .అప్పుడే సమస్య మీకు తెలిసేది.

* మంచి ఆహారం తినిపించాలి.

ఐరన్ బాగా ఉన్న ఆహారపదార్థాలు తినిపించాలి.రక్తలేమి సమస్య ఉంటుంది కదా అందుకే క్యారట్ లాంటివి అవసరం.

ఫైబర్ కూడా అవసరం.ఆపిల్ తినిపించాలి.

గ్రీన్ వెజిటబుల్స్ కూడా డైట్ లో ఉండాలి.కొన్నాళ్ళు ఆమెని సోడా, కారం బాగా ఉండే ఆహారపదార్థాల నుంచి దూరంగా ఉంచండి.

* ఆమె వ్యక్తిగత పరిశుభ్రత మీరు చేయడం కష్టం ఏమో కాని, ఆమె పరిశుభ్రత పాటిస్తుందో లేదో తెలుసుకుంటూ ఉండండి.ఇలాంటి సమయంలో హైజిన్ బాగా మేయింటెన్ చేయకపోతే ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి.

* బిడ్డకి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆవిడే పట్టించుకోవాలంటే కుదరదు.ఇక్కడ ఆమెకు కేవలం ఒక భర్తే కాదు, తన బిడ్డకు తండ్రి కూడా అవసరం.

బిడ్డ వ్యక్తిగత పరిశుభ్రత కావచ్చు, ఆలనాపాలన కావచ్చు, ఆమె విశ్రాంతి తీసుకున్నప్పుడు మీరే తల్లి బాధ్యతలు తీసుకోవాలి.అప్పుడే, మీరు మంచి భర్త, మంచి తండ్రి అనిపించుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube