Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

ఏంటి .. రూ.10 నాణాలు నిషేధించారా?-Ban On Rs.10 Coins .. Rumor Hits Karnataka Badly

Telugu

నోట్ల రద్ది తరువాత కొన్ని రోజులకి కరెన్సి బ్యాన్ వలన ఉప్పు ధర పెరిగిపోయింది, కిలో 400-500 రూపాయల దాకా వెళుతుంది అని ఓ రూమర్ పుట్టుకొచ్చింది గుర్తుందా? జనాలంతా నిజమని నమ్మి కిరాణ కొట్టులకు పరుగులు తీసారు. రెండేసి, మూడేసి ఉప్పు ప్యాకెట్లు ఎగబడి తెచ్చేసుకున్నారు. మళ్ళీ అలాంటి పరుగే నిన్న తీసారు కర్ణాటక జనాలు. ఈసారి కూడా ఓ రూమర్ వలనే ఇలా జరిగింది.

ఎక్కడినుంచో వచ్చిందో, ఎలా వచ్చిందో కాని, నకిలీ నాణెములు ఎక్కువ అవటం వలన, రూ.10 నాణాలను ఆర్బీఐ బ్యాన్ చేసిందని, ఈ క్షణం నుంచే ఈ నాణెములు చెల్లవని ఓ గాలికబురు కర్టాటకలో పెద్ద దుమారమే రేపింది. నాణేలు ఉన్న ప్రజలు బ్యాంకులకి పరుగులు తీసారు.

బ్యాంకువారికి మొదట అర్థం కాలేదు ఈ రచ్చ ఏంటని. ఆ తరువాత నెమ్మదిగా, ఓపిగ్గా అందరికీ అర్థం అయ్యేలా చెప్పారు, ఇది పుకారు అని, అసలేమాత్రం నిజం లేని గాలికబురు అని. ఈ విషయం అర్బీఐ దాకా వెళ్ళడంతో, ఆర్బీఐ బెంగళూరు శాఖ చీఫ్ మెనేజర్ పీజే థామస్ మీడియాతో మాట్లాడాల్సి వచ్చింది. ఈ వార్తలను నమ్మి ఎవరైనా రూ.10 నాణాలు తీసుకోవడానికి నిరాకరిస్తే నేరంగా పరిగణిస్తామని, ప్రజలు కూడా ఈ రూమర్ ని నమ్మొదని చెప్పుకొచ్చారు.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More in Featured

  • Genral

    A 7 year old Tamil Nadu Boy’s heroics made collector close a wine shop

    By

    ఏడేళ్ళ వయసులో ఉన్న పిల్లలు మామూలుగానైతే ఏం చేస్తారు? ప్రైమరీ స్కూలులో చదువుతూ, టీచర్లు ఇచ్చిన హోమ్ వర్క్ పూర్తీ చేసేందుకు...

  • Genral

    Why Parvathi Devi had to worship Ganesha ?

    By

    తల్లి దండ్రులని మించిన దేవుళ్ళు దేవతలు లేరని మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం. తోలిపూజలు అందుకునే వినాయకుడు కూడా కార్తికేయుడితో...

  • Genral

    Future French President’s Married his class teacher .. look at this unusual lovestory

    By

    సాధారణంగా అబ్బాయి వయసు ఎక్కువ, అమ్మాయి వయసు తక్కువ .. ఇలాంటి జంటల్నే చూస్తుంటాం. కాని తమ కన్నా పెద్ద వయసున్న...

  • Genral

    Sofia Hayat, who claimed herself as Lord Shiva’s mother got married

    By

    అసలు విషయం ఏమిటో పూర్తిగా తెలుసుకోకుండా పోరాపాటులో కూడా మమ్మల్ని తిట్టుకోవద్దు. అసలేక్కడా మేం పరమశివుడిని అవమానించేందుకు ప్రయత్నించట్లేదు. సోఫియా హయత్...

To Top