బాహుబలిని బ్యాన్ చేస్తాం, చూసేది లేదంటున్న మెగాఫ్యాన్స్

ప్రభాస్ ని ఇండస్ట్రీలో అంతా డార్లింగ్ అని పిలుస్తారు.ఎవరితోనూ ఎలాంటి గొడవ ఉండదు.

 Ban Baahubali 2 – Mega Fans Whatsapp Messages-TeluguStop.com

తన పని ఏదో తను చూసుకుంటాడు, అందరితోనూ బాగా మాట్లాడతాడు, అది కూడా అందరికి గురించి మంచి మాత్రమే మాట్లాడతాడు.అందుకే ప్రభాస్ కి యాంటి ఫ్యాన్స్ తక్కువ.

కాని అలాంటి ప్రభాస్ మీద పగబట్టేసారు కొందరు మెగాఫ్యాన్స్.అందుకు కారణం వారు ప్రభాస్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడమే.

ఎప్పుడో పాత ఇంటర్వ్యూలో, కొత్తగా మరో ఇంటర్వ్యూలో ప్రభాస్ ఈగ మీద ప్రశంసలు వర్షం కురిపించాడు.రాజమౌళి కెరీర్ లో ఈగ అత్యంత ఛాలెంజింగ్ సినిమా, దాన్ని తీయడం కష్టం, ఈగ ఇంటర్నేషనల్ స్డాండర్డ్ సినిమా అంటూ చెప్పుకొచ్చాడు డార్లింగ్.

మగధీరను ఎక్కడా కూడా అవమానించలేదు కాని, అది పెద్ద సినిమా అయినా, ఈగ ఇంకా గొప్ప సినిమా అన్నట్లుగా మాట్లాడాడు.ఇప్పుడు ఈ కామెంట్స్ లో అవమానం కనవడుతోందట మెగాఫ్యాన్స్ కి.

మగధీరను వదిలేసి ఈగను పొగొడ్తూ, ప్రభాస్ మగధీరని అవమానించాడని, ఎలాంటి సామాజిక అంశాలు లేకుండా, ఇంగ్లీషు సినిమాల మాదిరి గ్రాఫిక్స్ తో డబ్బులు దండుకుంటున్న బాహుబలి మేకర్స్ కి, ప్రభాస్ కి గుణపాఠం చెప్పాలని, అందుకోసం మెగాఫ్యాన్స్ ఎవరు బాహుబలి 2 సినిమాని చూడకూడదు అని వాట్సాప్ ఫ్యాన్స్ గ్రూప్స్ లో సందేశాలు పంపించుకుంటున్నారు కొందరు మెగాఫ్యాన్స్.అందరు ఇలానే ఉన్నారు అని కాదు, కొందరు ఉంటారు కదా, చిన్నవిషయాల్ని కూడా భూతద్దంలో చూస్తూ బూతులు వెతికేవారు .అలాంటివారి చేతిలో వాట్సాప్ ఉంటే ఏం చేస్తారు, మనకి ఎలాంటి మెసెజ్లు ఫార్వర్డ్ చేస్తారో తెలియని విషయం కాదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube