బాలకృష్ణ మాస్టర్ ప్లాన్

ఒకప్పుడు బాలయ్య బాబు సినిమా అంటే బాక్సాఫీస్ లెక్కలు మారిపోయేవి.రికార్డులు బద్దలు అయ్యేవి.

 Balakrishna To Work With Boyapati Again-TeluguStop.com

అలాంటి బాలకృష్ణ లక్ష్మీనరసింహ తరువాత ఫామ్ కోల్పోయారు.వరుసపెట్టి ఫ్లాపుల మీద ఫ్లాప్లు ఇచ్చేసారు.

కొన్ని సంవత్సారాలవరకు హిట్ లేని బాలయ్యబాబు గారికి మళ్లి హిట్ ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శీను.బాలకృష్ణ ని ఎలా వాడుకోవాలో బోయపాటికి తెలిసినంతగా మరెవరికి తెలియదు అనటం అతిశయోక్తి కాదు.

సింహతో భారి బ్లాక్బస్టర్ ఇచ్చిన బాలయ్య – బోయపాటి జోడి, మళ్లి లెజెండ్ తో మరో హిట్ ని అందుకున్నారు.రెండు సార్లు మనతో ఈలలు వేయించిన వీరిద్దరూ ముచ్చటగా మూడోసారి మనల్ని అలరించనున్నారు.

డిక్టేటర్ బాలకృష్ణకి 99వ సినిమా అన్న సంగతి తెలిసిందే.ఆ సినిమా పూర్తవకముందే 100 సినిమాకోసం సన్నధం అవుతున్నారు మన లయన్.

బాలకృష్ణ వందవ సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉంటుంది.లెజెండ్ చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థే ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.

ఈ సినిమాకు “గాడ్ ఫాదర్” అనే టైటిల్ ను పరిశీలుస్తున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి వందవ చిత్రాన్ని ఎవరి చేతిలోనో పెట్టి రిస్క్ తీసుకోకుండా బోయపాటితో సేఫ్ గేమ్ ఆడుతున్నారు బాలయ్య.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube