చెప్పులు తీయమని అసిస్టెంట్ ని కొట్టిన బాలకృష్ణ

మరోసారి మరో వీడియో, మరోసారి మరో వివాదం.నందమూరి బాలకృష్ణ పద్ధతి ఏం మారలేదు.

 Balakrishna Slaps Assistant For Uncivilized Reason-TeluguStop.com

మరోసారి తన కోపాన్ని పబ్లిక్ గా ప్రదర్శించి సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలకు చోటిచ్చారు బాలయ్యబాబు.

ఒక అభిమానిని బాలకృష్ణ ఫోన్లో దూషించిన ఆడియో ఫైల్ ఎంత వైరల్ వెళ్ళిందో మీకు గుర్తుకు ఉండే ఉంటుంది.

ఆ తరువాత ఓ ఆడియో ఫంక్షన్ లో అమ్మాయిలకి కడుపైనా చేయాలి లేదా ముద్దు అయినా పెట్టాలి అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి.మొన్నటికి మొన్న అభిమానులు ఫోటో దిగడానికి వస్తే బాలకృష్ణ అందులో ఓ అభిమానిని దూషిస్తూ గెంటేసారు‌.

ఆ వీడియోని జనాలు ఇంకా మరచిపోక ముందే మరో సంచలనాత్మకమైన వీడియో బయటకి వచ్చింది.

పైసా వసూల్ సినిమాని పూర్తి చేసిన మరుసటిరోజే బాలకృష్ణ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ తో సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

ఆ సినిమా సెట్లో తన అసిస్టెంట్ పై చేయి చేసుకున్నారు బాలయ్యబాబు.అదికూడా కాలి చెప్పులు తీయడం ఆలస్యం అయ్యిందని.

ఆయన చెప్పులు ఆయనే వదిలేయొచ్చుగా, వాటిని కూడా అసిస్టెంట్ తో తీయించడం ఏమిటి అని మీరు ఆశ్చర్యపోతున్నారేమో, బాలయ్య బాబుకి ఇలాంటి పట్టింపులు చాలా ఎక్కువ అని టాక్‌.ఆయన చెప్పులు కూడా అసిస్టెంట్ తీయాల్సిందే‌.

ఆలస్యం జరిగితే దెబ్బ పడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube