బాలయ్య షాకింగ్‌ నిర్ణయం

నందమూరి అందగాడు బాలకృష్ణ తాజాగా ‘లయన్‌’తో 98 సినిమాలు పూర్తి చేసుకున్నాడు.‘లయన్‌’కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.

 Balakrishna Shocking Decision-TeluguStop.com

వెంటనే మరో సినిమాను షురూ చేసే పనిలో బాలయ్య పడ్డాడు.బాలయ్య 99వ సినిమాకు ‘లౌక్యం’ ఫేం శ్రీవాస్‌ దర్శకత్వం వహించబోతున్నాడు అంటూ ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.

కోన వెంకట్‌, గోపీమోహన్‌, శ్రీధర్‌ సీపాన 99వ సినిమాకు స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారు.ఈనెలాఖరున సినిమాను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి.ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య ప్రతిష్టాత్మక 100వ సినిమాను ప్రారంభించనున్నాడు.

99వ సినిమాకు ‘డిక్టేటర్‌’ అనే టైటిల్‌ ఖరారు అయ్యింది.ఇదే సంవత్సరంలో ‘డిక్టేటర్‌’ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి, వచ్చే సంవత్సరం జనవరిలో 100వ సినిమాను ప్రారంభించబోతున్నాడు.బాలయ్య 100 సినిమాలు పూర్తి అయిన తర్వాత హీరోగా రిటైర్‌ అవ్వనున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.100వ సినిమా తర్వాత ఇతర హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించేందుకు మరియు వయస్సుకు తగ్గ పాత్రల్లో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తాను అంటూ బాలయ్య తాజాగా అత్యంత సన్నిహితులకు ఫ్యాన్స్‌కు తెలియజేసినట్లుగా తెలుస్తోంది.బాలయ్య తీసుకున్న ఈ నిర్ణయం నందమూరి ఫ్యాన్స్‌కు నిజంగా షాకింగ్‌ న్యూసే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube