లోకేష్ మంత్రి ప‌ద‌వికి బాల‌య్యే అడ్డా..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ బాబు ఉర‌ఫ్ చిన‌బాబుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని ఎప్ప‌టి నుంచో డిమాండ్ వినిపిస్తోంది.అయితే, ఆయ‌న చ‌ట్ట స‌భ‌ల‌కు చెందిన ప్ర‌తినిధి కాడు.

 Is Balakrishna Opposing Lokesh As Cabinet Minister..?-TeluguStop.com

దీంతో లోకేష్ మంత్రి కావాల‌ని కోరుకుంటున్న టీడీపీ నేత‌లు ఒక‌రిద్ద‌రు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి త‌మ స్థానాల నుంచి లోకేష్‌కు అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు.దీంతో ఈ విష‌యం రాష్ట్రంలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారితీసింది.

మ‌రోప‌క్క‌, తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ మంత్రిగా దూసుకుపోతున్నారు.

ఈ క్ర‌మంలో త‌న త‌న‌యుడి భ‌విష్య‌త్ రీత్యా లోకేష్‌ను మంత్రిని చేయాల‌ని చంద్ర‌బాబు కూడా భావిస్తున్నార‌ని, కేటీఆర్ త‌ర‌హాలో కాక‌పోయినా లోకేష్ కూడా దూసుకుపోగ‌ల‌డ‌ని బాబు భావిస్తున్నార‌ని తెలిసింది.

ఇక, ఇదే విషయాన్ని తెలుగు దేశం నేత‌లు ప‌దే ప‌దే మీడియా ముందు కూడా ప్ర‌స్తావించారు.లోకేష్ మంత్రి కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని అర్హ‌త‌లు ఉన్నాయ‌ని చెప్పారు.

ఈ క్ర‌మంలో రేపో మాపో విస్త‌రిస్తార‌ని భావిస్తున్న ఏపీ కెబినెట్ ష‌ఫిలింగ్‌లో లోకేష్‌కు బెర్త్ ఖాయ‌మైంద‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి.

అయితే, ఇప్పుడు ఇదేవిష‌యంలో లోకేష్ మామ, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌య్య తీవ్ర‌స్థాయిలో విభేదిస్తున్న‌ట్టు స‌మాచారం వ‌స్తోంది.

లోకేష్‌కు ఇంకా అనుభ‌వం రావాల్సి ఉంద‌ని, అలాంటి వ్య‌క్తిని ఇప్ప‌టికిప్పుడు మంత్రిని చేస్తే.యాంటీ సిగ్న‌ల్స్ వెళ్తాయ‌ని బాల‌య్య అంటున్నార‌ట‌.

అంతేకాకుండా, భావి సీఎంగా లోకేష్‌ను ప్రొజెక్ట్ చేయాల‌ని అనుకుంటున్న‌ప్పుడు ఇప్ప‌డిలా మంత్రిని చేస్తే.జ‌నాలు జీర్ణించుకోలేర‌ని కూడా బాల‌య్య త‌న స‌న్నిహితుల‌తో అన్నారట‌.

దీంతో ఈ విష‌యం ఇప్పుడు చంద్ర‌బాబు కోర్టుకు వెళ్లింద‌ని అంటున్నారు.మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.

మొత్తానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌మాచారం ప్ర‌కారం లోకేష్ మంత్రి ప‌ద‌వికి బాల‌య్యే అడ్డు త‌గులుతున్నార‌న్న చ‌ర్చ‌లు ఏపీ పాలిటిక్స్‌లో వినిపిస్తున్నాయి.అందుకే ద‌స‌రాకే విస్త‌ర‌ణ చేయాల్సిన కేబినెట్‌ను బాబు వాయిదా వేసుకుంటూ వ‌స్తున్నార‌న్న టాక్ కూడా వ‌స్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube