టాలీవుడ్లో ఎప్పుడు ఏదో ఒక క్రేజీ కాంబినేషన్ కలిసి సినిమా చేస్తున్నట్టు హడావిడి చేస్తూనే ఉంటారు.అది కుదురిద్దా కుదురుతుందా అన్నది పక్కన పెడితే ఫ్యాన్స్ మాత్రం అలాంటి వార్తలతో తెగ ఎంజాయ్ చేస్తుంటారు.
ప్రస్తుతం అలాంటి క్రేజీ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతుంది.అదేంటంటే నందమూరి నట సింహం బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తున్నారని.
ఓ పక్క పౌరుషం.మరో పక్క రాజసం ఈ రెండు కాంబో కలిస్తే ఇంకేమన్న ఉందా.
రికార్డులు షేక్ ఆడాల్సిందే.
బాలయ్య, మహేష్ ల ఇమేజ్ కు సరిపోయే కథ సిద్ధంగా ఉందని.
ఇద్దరు కలిసి ఈ సినిమాకు పని చేస్తారని రూమర్.అయితే ఇందులో నిజమెంత అన్నది తెలియదు కాని ప్రస్తుతం బాలకృష్ణ శాతకర్ణి సినిమాలో బిజీ అవగా.
మహేష్ మురుగదాస్ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు.మరి కాంబినేషన్ ఓకే అయినా సినిమా మాత్రం ఇప్పుడప్పుడే ఉండే అవకాశం లేదు.
ఇక ఈ ఇద్దరి మేటి స్టార్స్ ను పెట్టి ఎవరికి ఇసుమంత కూడా ఇమేజ్ గొడవలు రాకుండా డైరెక్ట్ చేయగల దర్శకుడు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు.రాబోయే ఈ క్రేజీ ప్రాజెక్ట్ అసలు ఉంటుందా ఉండదా ఉంటే ఎవరు డైరెక్ట్ చెస్తారు ఏ బ్యానర్ నిర్మిస్తుంది అన్నది తెలుసుకోవాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.