‘లయన్‌’ వాయిదా పడనుందా?

నందమూరి బాలకృష్ణ ‘లయన్‌’ సినిమాకు ఎప్పుడు లేని సమస్య వచ్చింది.ఈ చిత్ర దర్శకుడు సత్యదేవ 25 కోట్ల బడ్జెట్‌తో సినిమాను పూర్తి చేయాల్సి ఉండగా ఏకంగా పది కోట్ల బడ్జెట్‌ పెంచి 35 కోట్లకు పూర్తి చేశాడు.

 Balakrishna Lion Release Date Is Postponed..?-TeluguStop.com

దాంతో ఇప్పుడు సేఫ్‌ జోన్‌లో ‘లయన్‌’ సినిమాను అమ్మేందుకు నిర్మాత రుద్రపాటి రమణరావు తెగ కష్టాలు పడుతున్నాడు.పెట్టిన బడ్జెట్‌ రాబట్టుకునేందుకు ఈ సినిమాను ఎక్కువ రేట్లకు అమ్మాల్సిన పరిస్థితి.

అయితే అంత భారీ మొత్తానికి ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు మాత్రం డిస్ట్రిబ్యూటర్లు సిద్దంగా లేరని తెలుస్తోంది.

మే 1న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు.

అయితే ఇంకా పలు ఏరియాల్లో ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడం లేదు.విడుదల తేదీ దగ్గర పడుతున్నా కూడా ఈ సినిమా అమ్ముడు పోక పోవడంతో అసలు ఈ సినిమా చెప్పిన సమయానికి విడుదల అయ్యేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

బాలయ్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయాలని నిర్మాతపై ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది.మరి డిస్ట్రిబ్యూటర్లు లేకుండానే ఈ సినిమాను నిర్మాత సొంతంగా విడుదల చేస్తాడా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube