సెంటిమెంట్‌ బాలయ్య

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలు సెంటిమెంట్‌లను ఫాలో అవుతారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రతీ హీరో కూడా తన సక్సెస్‌ మూవీ సెంటిమెంట్‌లను ఫాలో అవుతూనే ఉంటారు.

 Balakrishna Follows Sentiment For Lion Release-TeluguStop.com

తాజాగా బాలయ్య తన ‘లయన్‌’ సినిమాకు సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడు.‘లెజెండ్‌’ సూపర్‌ హిట్‌ అయిన విషయం తెల్సిందే.

ఆ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అదే రోజు ‘లయన్‌’ను కూడా తీసుకు రావాలని భావించాడు.

కాని పరిస్థితులు అనుకూలించలేదు.దాంతో కనీసం ఆ డేట్‌కు ఆడియోను అయినా విడుదల చేయాలని భావిస్తున్నాడు.

బాలకృష్ణ, త్రిష, రాధిక ఆప్టే జంటగా నటించిన ఈ సినిమాకు సత్యదేవ్‌ దర్శకత్వం వహించాడు.రుద్రపాటి రమణరావు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లుగా దర్శకుడు సత్యదేవ్‌ ఇప్పటికే పలు సార్లు చెప్పుకొచ్చాడు.ఇక ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలయ్య ద్వి పాత్రాభినయం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.నందమూరి అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

‘లెజెండ్‌’ సెంటిమెంట్‌ ఈ సినిమాకు వర్కౌట్‌ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube