బాలయ్య పంతాలకు పోయి కష్టాలు తెచ్చాడు.

ఊహించినట్టుగానే కోనా వెంకట్ పంజా ఈ సంవత్సరం కూడా సరిగ్గా పనిచెయ్యలేదు.గతేడాది వరస ప్లాపులతో సతమతం అయిన కోనా వెంకట్ అండ్ గ్యాంగ్ ఈ సంవత్సరం డిక్టేటర్ మీద చాలా ఆశలే పెట్టుకున్నారు .

 Balakrishna Dictator Collections-TeluguStop.com

బాలయ్య సినిమాలేవీ సాధారణంగా ఏవరేజ్ లు వుండవు.అయితే బ్లాక్ బస్టర్.

లేకుంటే ఫ్లాప్ లే.లెజండ్ తరువాత చేసిన లయన్ సినిమా ఫలితం వెంటనే తేలిపోయింది.ఆ తరువాత వచ్చిన డిక్టేటర్ వ్యవహారం వేరుగా వుంది.డిక్టేటర్ సినిమాకు మాగ్జిమమ్ హైప్ వచ్చింది.ఇటీవల వస్తున్న యంగ్ టాప్ హీరోల సినిమాల మాదిరి హైప్ తెచ్చుకుంది.మంచి టేబుల్ ప్రాఫిట్ తెచ్చుకుంది.

లౌక్యం సినిమాతో కాస్త పేరు తెచ్చుకున్న దర్శకుడు శ్రీవాస్ కూడా ఇందుకు చాలా వరకు కారణం.అయితే నేరుగా వచ్చి వుంటే ఎలా వుండేదో కానీ, సంక్రాంతి పోటీల్లో చిక్కుకుంది.

దాంతో అసలు విషయం మీద కన్నా ఈ సినిమానా.ఆ సినిమానా అన్న బాటలోకి వెళ్లిపోయాయి అంచనాలు.

ఎందుకో బాలయ్య ఫ్యాన్స్ కూడా ‘బాక్సాఫీస్ మే సవాల్’ అనకుండా జూనియర్ ఇప్పుడు ఎందుకు రావాలి అని మాత్రమే నిలదీయడం.ప్రశ్నించడం ప్రారంభించారు.ముందుగా రిజర్వ్ చేసుకున్నది మేం అని వాదించడం ప్రారంభించారు.దాంతో సినిమా ఎలా వుంటుంది అనే దాని కన్నా, హిట్ అవుతుందా కాదా? జూనియర్.బాలయ్య.ఎవరి సినిమా నిలుస్తుంది అనే దానిపై డిస్కషన్లు ఎక్కువయ్యాయి.థియేటర్ ల సమస్యలూ, సీడెడ్ లో బయ్యర్లు లేకపోవడం లాంటివి చాలా పెద్ద ఇబ్బందులు తలెత్తాయి.ఒక విధంగా చెప్పాలంటే డిక్టేటర్ కు కలెక్షన్లతో సంబంధం లేని టాక్ అయితే వచ్చింది.

సినిమా బాగుంది.సూపర్.ల?ఇలా.కానీ ఆ రేంజ్ లో కలెక్షన్లు మాత్రం ఫిగర్ల రూపంలో కనిపించడంలేదు.

ఇప్పటికి వసూళ్లు 12 కోట్ల రేంజ్ లోనే వున్నట్లు ట్రేడ్ వర్గాల బొగట్టా.ఇదే సోలోగా వచ్చి వుంటే, ఇంతకు అంత థియేటర్లలో విడుదలయి వుండేది.టాక్ ఎలా వున్నా, పండుగ కలెక్షన్లు జేబులో వేసుకునేది.కంగారు పడడం తో కోనా కీ ప్లాప్ ఇచ్చి తానూ ప్లాప్ తెచ్చుకుని పంతాలకి పోయి ఇబ్బందుల్లో పడ్డాడు బాలయ్య.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube